మన భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శాఖాహారం తీసుకునే వారికంటే మాంసాహారం తీసుకునేవారు ఎక్కువ శాతం ఉన్నారు.నిజానికి మాంసాహారం తినడం మంచిది.
కానీ, మాంసాహారాన్ని అతిగా తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి.ఇలా మాంసాహారం ఎక్కువ తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు పుష్కలంగా లభించడంతో చాలా వరకు మాంసాహారం సేవించడానికి మొగ్గు చూపుతుంటారు.
ఇలా ప్రోటీన్స్ లభిస్తాయని ఎక్కువ మోతాదులో మాంసాహారం తీసుకుంటే మాత్రం పప్పులో కాలు వేసినట్లే.ఊబకాయం, క్యాన్సర్, కంటి సమస్యతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అనే చెప్పాలి.
అధికంగా మాంసాహారం తీసుకోవడం వల్ల మొదట మలబద్దకం సమస్య వస్తుంది.వాస్తవానికి మాంసంలో ఫైబర్ పదార్థం ఉండదు.కనుక ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి .అలాగే ఎవరైనా మాంసం ఎక్కువ మోతాదులో తీసుకుంటే వారు తల నొప్పితో బాధపడే అవకాశం బాగా ఉన్నట్లు వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.ఈ సమస్యతో పాటు కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.మాంసాహారం అధికంగా సేవించడం ద్వారా కాల్షియం సమస్య, త్వరగా అలసిపోయే అవకాశాలు, వీటితోపాటు ఎముకల పని తీరుపై కూడా ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక నిజానికి ప్రోటీన్ జీర్ణం కావడానికి శక్తి, పోషకాలు చాలా అవసరం అవుతాయి.అందులో మాంసాహారం ఎక్కువగా తింటే జీర్ణ సంబంధిత వ్యాధులు ఖచ్చితంగా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇలా మాంసాహారం అధికంగా తీసుకునేవారు అధిక బరువు పెరిగే అవకాశంతో పాటు త్వరగా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా ఉన్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ఏది ఏమైనా కానీ మాంసాహారం ఎక్కువ తీసుకొనే వారు అధిక మోతాదులో సేవించేవారు కాస్త చర్యలు పాటిస్తూ, అలాగే తక్కువ మోతాదులో తీసుకోవడం ఎంతో మంచిది.