తండ్రే గురువైన వేళ.. ఒకరిని ఎగతాళి చేసినందుకు ఏం శిక్ష విధించాడంటే?

పిల్లల నడవడిక అనేది గురువులతో పాటు తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటుంది.అయితే, భారతదేశంలో టీచర్స్ చిల్డ్రన్స్ పట్ల కేర్ తీసుకుంటున్న మాట వాస్తవమే.

 If The Father Is A Teacher What Is The Punishment For Making Fun Of Someone , Fa-TeluguStop.com

కానీ, పేరెంట్స్ మాత్రం కొంత తక్కువగానే కేర్ తీసుకుంటూ ఉంటారు.ఒకప్పటిలాగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబం దాఖలాలు లేకపోవడంతో పిల్లలు విచ్చలవిడిగా తయారవుతున్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

ఇకపోతే క్రమశిక్షణ లేని పిల్లలు రేపటి తరంలో పౌరులుగా మారి అసాంఘీక శక్తులుగా మారే చాన్సెస్ ఉంటాయి.ఈ క్రమంలోనే పిల్లలను క్రమశిక్షణలో ఉంచడం చాలా ముఖ్యం.

లేదంటే వారు ఇతరులను ఎగతాళి చేస్తూ సమాజానికి ఎందుకూ పనికిరాని వారుగా తయారవుతారు.తాజాగా ఓ తండ్రి తన కూతురు కేన్సర్ పేషెంట్‌ను ఎగతాళి చేసినందుకుగాను కఠినమైన శిక్ష వేసి నిజమైన గురువులా మారాడు.

సాధారణంగా కొందరు పేరెంట్స్ తమ పిల్లలు తప్పు చేసినా వారిని సమర్థిస్తున్న ఈ నేపథ్యంలో ఓ తండ్రి కూతురికి మంచి, చెడు తెలిపేందుకుగాను వేసిన శిక్ష పట్ల ప్రశంసలు లభిస్తున్నాయి.వివరాల్లోకెళితే.

ఫ్లోరిడాకు చెందిన పేరెంట్స్ కొంతకాలం కిందట డైవోర్స్ తీసుకున్నారు.అయితే, పిల్లల బాధ్యతను మాత్రం ఇద్దరూ సమంగా తీసుకున్నారు.

దీంతో మాజీ భార్య కూతురికి ఫాదర్ గార్డియన్‌గా ఉన్నాడు.

ఈ క్రమంలోనే ఇటీవల అతడి కూతురు తోటి విద్యార్థి కేన్సర్‌తో బాధపడుతుంటే మానవత్వంతో స్పందించాల్సిందిపోయి అవమానించింది.

కేన్సర్ ఉన్న ఆ విద్యార్థినికి హెయిర్ లేకపోవడం చూసి ఎగతాళి చేసింది.అంతటితో ఆగకుండా సదరు కేన్సర్ ఉన్న విద్యార్థిని ధరించిన విగ్‌ను లాగి పడేసింది.ఈ విషయం తండ్రికి తెలియగానే తన కూతురిని మందలించాడు.కేన్సర్ బాధితురాలితో అలా చేయొద్దని చెప్పాడు.

అయినా అతడి కూతురిలో మార్పుల రాలేదు.దాంతో ఆమెకు శిక్ష విధించాడు.

సెల్ ఫోన్‌ను వదులోకోవాలని లేదా గుండు గీసుకోవాలని చెప్పాడు.కూతురు గుండు గీసుకునేందుకు అంగీకరించగా, తండ్రియే గుండు గీశాడు.

ఈ స్టోరీ తెలుసుకున్న నెటిజన్లు కూతురిని సక్రమ మార్గంలో నడిపేందుకుగాను తండ్రి ఈ శిక్ష విధించాడని పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube