సినిమా ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నాని హీరోగా నటించినటువంటి “టక్ జగదీష్” చిత్రాన్ని ఇన్ని రోజులు వరకు థియేటర్లో విడుదల చేస్తామని చివరికి ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ యాజమానులు, చిత్ర బృందం హీరో నాని పై తీవ్ర విమర్శలు చేశారు.ఈ క్రమంలోనే నానికి భవిష్యత్తు అంటే ఏంటో చూపిస్తామని, నాని కేవలం సినిమాలలో మాత్రమే హీరోగా కనిపిస్తారని.
జీవితంలో నాని ఒక పిరికివాడని హీరో నాని పై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ విధంగా నాని పై విమర్శలు చేసిన థియేటర్ యజమానులు గురించి ఇండస్ట్రీలో పలు విమర్శలు వెల్లువెత్తడంతో తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ నాని, చిత్ర బృందానికి క్షమాపణ కోరుతూ అపాలజీ లెటర్ విడుదల చేశారు.
అయితే నాని తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి ఏమాత్రం ఇష్టం లేదని, తనకి సినిమాలను థియేటర్లో చూడటమే ఇష్టమని ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో తెలియజేశారు.అయితే ఈ సినిమా థియేటర్లో విడుదల చేయటం వల్ల నిర్మాతలపై అధిక భారం పడుతుందన్న క్రమంలోనే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు నాని వివరణ ఇచ్చారు.
అయినప్పటికీ తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ విమర్శలు చేయడంతో ఎవరినైనా ఎగ్జిబిటర్లు వారి వారి వ్యక్తిగత హోదాలో ఎవరినైనా విమర్శించి ఉంటే క్షమించాలి అంటూ అపాలజీ లెటర్ విడుదల చేసింది.వచ్చే నెల 10వ తేదీ నాని నటించిన “టక్ జగదీష్” ఓటీటీలో విడుదల కాగా అదే రోజు నాగచైతన్య నటించిన “లవ్ స్టోరీ” థియేటర్లలో విడుదల కావడంతో ఈ రెండు సినిమాల మధ్య కాస్త వివాదం చెలరేగింది.ఈ క్రమంలో శుక్రవారం నిర్వహించిన ఫిలింఛాంబర్ తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ నాని సినిమా పై విమర్శలు చేయడంతో ఈ మేరకు థియేటర్ యజమానులు నాని చిత్ర బృందానికి క్షమాపణ తెలియజేసింది.