ట్రంప్ పై విమర్సల వెల్లువ..!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం మాత్రమే కాదు పిరికితనం ప్రదర్శించారు.కాదు కాదు ప్రజలకోసం వెనకడుగు వేశారు , అదేమీ కాదు నిజంగా ట్రంప్ ఓడిపోయినట్టే.

 Huge Allegations On Trump For His Ruling In America-TeluguStop.com

అంటూ ట్రంప్ పై విమర్శకులు, మద్దతు దారులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.ఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం వ్యుహత్మకే అంటూ మరికొందరు అంటున్నారు.సరిహద్దు గోడ విషయంలో…

కాంగ్రెస్ తో ఎలాంటి ఒప్పందం కాకుండానే ట్రంప్ ప్రభుత్వాన్ని తిరిగి తెరవడంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.ఒత్తిళ్ళకి ట్రంప్ తలొగ్గారని, అయినా సరే గోడ నిర్మించి తీరుతారని కొందరు అంటుంటే.మరి కొందరు మాత్రం ట్రంప్ ఓ పిరికి పందలా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

అమెరికా దేశ చరిత్రలోనే ఈ రకంగా దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం పాక్షికంగా మూసివేయడం.

ఈ మూసివేతకి తెరదించుతూ ట్రంప్ తానూ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకున్నారు.దక్షిణ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని హామీ ఇచ్చిన ట్రంప్, అందుకు తగ్గట్టుగా ఎటువంటి నిధులు రాకపోయినా సరే ప్రభుత్వాన్ని తెరవడం సరైన నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు.

అయితే ఒక వేళ కాంగ్రెస్ నుంచీ ఈ ఒప్పందంపై సమాధానం సరిగా రాకుంటే మాత్రం మళ్ళీ ఫిబ్రవరి 15వ తేదీన ప్రభుత్వం మూతపడుతుందని ట్రంప్ హెచ్చరించారు.తానూ మానవటంగా భద్రతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి తన అధికారాలని తప్పకుండా వినియోగిస్తానని ట్రంప్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube