ఇంట్లోకి త‌ర‌చూ పాములు వ‌స్తున్నాయా.. ఇలా చేశారంటే వాటితో ఇక‌పై నో టెన్ష‌న్‌!

సాధారణంగా కొందరికి పాము అని అంటే చాలు వెన్నులో వణుకు పుడుతుంటుంది.అల్లంత దూరంలో పామును చూశారంటే కిలోమీటర్ పరిగెడుతుంటారు.

 How To Keep Snakes Away From The House? Snakes, Life Style, Simple Tips, Summer,-TeluguStop.com

ఎందుకంటే పాములు విషపూరితమైనవి.పాముకాటుకు గురైతే ప్రాణాలకే ప్రమాదం.

అయితే మనుషులను చూడగానే పాములు వెంటనే దాడి చేస్తాయ‌నుకుంటే పొరపాటే.పాములంటే మనుషులకు ఎంత భయమో.

మనుషులన్నా కూడా పాములకు అంతే భయం.తమకు హాని చేస్తార‌ని భావించినప్పుడు మాత్రమే పాములు( Snakes ) మనుషులను కాటు వేస్తాయి.ఇకపోతే చలికాలం మరియు వేసవికాలంలో పాముల బెడ‌ద ఎక్కువగా ఉంటుంది.ఇంట్లోకి తరచూ పాములు వస్తుంటాయి.పాముల వల్ల క్షణక్షణం భయపడుతూ ఉంటారు.అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ని ఫాలో అయితే పాములతో ఇకపై టెన్షన్ పడక్కర్లేదు.

మరి లేటెందుకు ఎలాంటి టిప్స్ ను పాటిస్తే ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయో తెలుసుకుందాం పదండి.

Telugu Basil, Garlic, Ginger, Simple Tips, Snake, Snake Problem-Telugu Health

పాములు రాకుండా ఉండాలంటే ఇంటిని మ‌రియు ఇంటి చుట్టుప‌క్క‌ల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి.గ‌డ్డిని ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించాలి.అలాగే ఇంటి ముందు తుల‌సి మొక్క‌ను పెంచుకోవాలి.

ఎందుకంటే, ప‌విత్ర‌మైన తుల‌సి వాస‌న పాముల‌కు అస్స‌లు న‌చ్చ‌దు.తుల‌సి మొక్క‌లు ఉంటే పాముల బెడ‌ద త‌గ్గుతుంది.

బంతి పూల మొక్కలు, గోధుమ గడ్డిని పెంచినా కూడా పాములు రావు.వీటి నుండి వచ్చే ఒక రకమైన ఆమ్ల వాసన పాములను త‌రిమి కొడ‌తాయి.

Telugu Basil, Garlic, Ginger, Simple Tips, Snake, Snake Problem-Telugu Health

మల్లి మొక్కలు, చమేలీ మొక్కలు, మొగలి పొదలు, పారిజాతం చెట్టు ఇంట్లో మరియు ఇంటి చుట్టు ఉంచ‌కూడ‌దు.ఈ మొక్క‌ల పువ్వులు నుండి వ‌చ్చే వాస‌న పాములను ఆకర్షిస్తాయి.అలాగే పాముల‌కు అల్లం, వెల్లుల్లి వాస‌న( Garlic ) అంటే అస్స‌లు ప‌డ‌దు.అల్లం పొడిని వాట‌ర్ లో కలిపి ఇంటి చుట్టూ చల్లితే పాములు రాకుండా ఉంటాయి.

లేదా వెల్లిల్లి రెబ్బ‌ల‌ను మెత్త‌గా దంచి అందులో ఆవాల నూనె కలపండి.ఈ మిశ్ర‌మాన్ని ఒక‌రోజంతా క‌ద‌ప‌కుండా ఉంచేసి.మ‌రుస‌టి రోజు ఇంటి చుట్టూ వేయండి.ఇలా చేసినా కూడా పాములు రావు.

పాడైపోయిన ఉల్లిపాయ‌ల‌ను ఇంటి చూట్టు వేసినా పాములు రాకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube