ముఖం ఎంత తెల్లగా ఉన్నా కూడా చర్మం పై అక్కడక్కడ కనిపించే మచ్చలు అందాన్ని పాడు చేస్తాయి.మనల్ని కాంతిహీనంగా చూపుతాయి.
అందుకే స్పాట్ లెస్ స్కిన్ కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.అటువంటి చర్మాన్ని పొందడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే స్పాట్ లెస్ అండ్ బ్రైట్ స్కిన్ పొందటానికి ఇప్పుడు చెప్పబోయే క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది.రోజు నైట్ ఈ క్రీమ్ ను కనుక వాడితే అద్భుత ఫలితాలు పొందుతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు రెబ్బలు వేపాకులు వేసుకోవాలి.అలాగే అంగుళం పీల్ తొలగించిన పచ్చి పసుపు కొమ్ము మరియు మూడు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ లో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ అనేది సిద్ధమవుతుంది.
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖాన్ని వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రోజు నైట్ ఈ క్రీమ్ ను వాడడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
ఈ హోమ్ మేడ్ క్రీమ్ మొండి మచ్చలకు వ్యతిరేకంగా పోరాడుతుంది.ఎలాంటి మచ్చలనైనా క్రమంగా మాయం చేస్తుంది.
అలాగే చర్మాన్ని బ్రైట్ గా షైనీ గా మెరిపిస్తుంది.డ్రై స్కిన్ తో బాధపడేవారికి కూడా ఈ క్రీమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
రెగ్యులర్ గా ఈ క్రీమ్ వాడితే చర్మం తేమగా ఉంటుంది.అందంగా కాంతివంతంగా మెరుస్తుంది.
కాబట్టి స్పాట్ లెస్ అండ్ బ్రైట్ స్కిన్ కోసం తప్పకుండా ఈ క్రీమ్ ను ప్రయత్నించండి.