గత సంవత్సరం కరోనా భయపెడితే, ఈ సంవత్సరం రోడ్దు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.నిత్యం ఇలాంటి ప్రమాదానికి సంబంధిన అంశాలు వార్తల్లో నిలుస్తున్నాయి.
ఇక ఇలాంటి మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆ వివరాలు చూస్తే.
బీహార్‌లోని నలందా జిల్లాలో, టెల్హడా ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లిడంతో, హోటల్ సిబ్బందితో సహా 8 మంది మృతి చెందగా, మరికొందరికి తీవ్రంగా గాయాలు అయ్యినట్లుగా సమాచారం.అయితే ఈ ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ట్రక్కును అక్కడే వదిలేసిన డ్రైవర్ పరారయ్యారట.
కాగా ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు ట్రక్కుకు నిప్పంటించడమే కాదు, సహాయక చర్యలు చేపట్టేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వడంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందట.ఇక ఈ ప్రమాద ఘటనపై స్పందించిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతి చెందినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.