రవితేజ కొత్త సినిమాకి చిరంజీవి ఘరానా మొగుడు లింక్

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తుంది.

 Ravi Teja Khiladi Movie Concept Similar To Gharana Mogudu, Megastar Chiranjeevi,-TeluguStop.com

ఇందులో రవితేజకి జోడీగా తెలుగమ్మాయి డింపుల్ హయాతీ, కొత్త అమ్మాయి మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు.క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి జోష్ మీద ఉన్న రవితేజ ఈ సినిమాతో మరో శాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.

దానికోసం గట్టిగానే కష్టపడుతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ నడుస్తుంది.

ఇదిలా ఉంటే ఇందులో హాట్ యాంకర్ అనసూయ కూడా కీలక పాత్రలో నటిస్తుందనే టాక్ వినిపిస్తుంది.ఇక ఖిలాడీ సినిమా గురించి టాలీవుడ్ లో మరో హాట్ న్యూస్ వినిపిస్తుంది.

ఈ సినిమా కాన్సెప్ట్ మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ అయినా ఘరానా మొగుడుకి దగ్గరగా ఉంటుందనే మాట బలంగా వినిపిస్తుంది.ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవి పొగరు ఎక్కువ ఉంటూ వ్యాపారవేత్త అయిన నగ్మ కంపెనీలో చేరి లేబర్ నాయకుడు అవుతాడు.

తరువాత ఆమెని పెళ్లి చేసుకొని హీరోయిన్ అహంకారాన్ని నాశనం చేస్తాడు.

అయితే ఈ తరహా ఎలిమెంట్ కాకుండా కాస్తా అటుఇటుగా ఖిలాడీ సినిమా కాన్సెప్ట్ దగ్గరగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఇందులో మీనాక్షి చౌదరి మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతుందని, ఆమె కంపెనీలో పనిచేసే ఉద్యోగిగా రవితేజ కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.వారి మధ్య నడిచే టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆసక్తికరంగా ఉంటుందనే మాట వినిపిస్తుంది.

రవితేజ కెరియర్ ఈ తరహా పాత్ర చేయడం మొదటి సారి అయినా కూడా తనకి అలవాటైన కామెడీ టైమింగ్ తో అలరిస్తాడని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube