తెలుగులో బాలకృష్ణకి జోడీగా లెజెండ్, లయిన్ సినిమాలలో కనిపించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే.ఈ అమ్మడు ఏ సినిమా చేసిన తన ప్రత్యేకత కనిపించే విధంగా చూసుకుంటుంది.
థియేటర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన రాధికా ఆప్టే ముందుగా హిందీ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన బెంగాలీ, మరాఠీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఎక్కువగా కాన్సెప్ట్ బేస్ కథలు చేయడానికి ఇష్టపడే ఈ భామ పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించడానికి కూడా అభ్యంతరం చెప్పదు.
నటిగా రాణించేవారు ఎలాంటి హద్దులు పెట్టుకోకూడదు అనేది ఈమె సిద్ధాంతం.అందుకనే నేచురాలిటీ కోసం ఎంత వరకైనా వెళ్లి నటించడానికి రాధికా ఆప్టే సిద్ధంగా ఉంటుంది.
పెళ్లి తర్వాత ఈ భామ సినిమా కెరియర్ ప్రారంభించింది.ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో రాధికా ఆప్టే పేరు కూడా కచ్చితంగా ఉంటుంది.
ఇండియన్ ఇండస్ట్రీ నుంచి హాలీవుడ్ లో చేసిన కొద్ది మంది కథానాయికలలో ఈమె కూడా ఉంటుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామ ఎక్కువగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో వెబ్ సిరీస్ లు ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపిస్తుంది.సినిమా అనేసరికి కొన్ని లిమిట్స్ ఉంటాయి.సెన్సార్ ఉంటుంది.
వెబ్ సిరీస్ లకి అలాంటి రూల్స్ ఉండవు కాబట్టి అక్కడ అయితే నటిగా మరిన్ని అద్బుతమైన పాత్రలు చేయొచ్చని రాధికా ఆప్టే విశ్వసిస్తుంది.తెలుగులో ఆమె బాలకృష్ణతో రెండు సినిమాలు చేసినా కేవలం డబ్బుల కోసం నటించినట్లు గతంలో ఓ సందర్భంగా ఆమె ఆసక్తికర వాఖ్యలు చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ ఓ కొత్త సినిమా చేస్తుంది.అయితే ఇందులో రెగ్యులర్ కి భిన్నంగా చీరకట్టిన గూఢచారిగా కనిపిస్తుంది.
సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.చీరకట్టి నడుము దగ్గర గన్ దాచుకొని ఉన్న ఈ లుక్ కాస్తా కొత్తగానే కనిపిస్తుంది.
మిస్సెస్ అండర్ కవర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అనుశ్రీ మెహ్రా దర్శకురాలిగా పరిచయం అవుతుంది.