పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ కనివిందు చేసే మొక్కల్లో `నేల ఉసిరి` ఒకటి.అయితే ఈ మొక్కలు ఎందుకూ పనికి రావని చాలా మంది భావిస్తుంటారు.
ఈ క్రమంలోనే పిచ్చి మొక్కలుగా భావించి.వాటిని పీకి పారేస్తుంటారు.
కానీ, నేల ఉసిరి ఆకులు, పువ్వులు, కాయలు, కాండం, వేర్లు ఇలా అన్నటిలోనూ ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.అందుకే పూర్వ కాలం నుంచి ఈ నేల ఉసిరిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు.
ముఖ్యంగా నేల ఉసిరి ఆకులతో ఎన్నో జబ్బులను నివారించుకోవచ్చు.
![Telugu Benefitsnela, Tips, Latest, Nela Usiri-Telugu Health - తెలుగు Telugu Benefitsnela, Tips, Latest, Nela Usiri-Telugu Health - తెలుగు](https://telugustop.com/wp-content/uploads/2021/08/health-benefits-of-nela-usiri-nela-usiri-nela-usiri-for-health-health-tips-good-health-lat.jpg )
మరి ఆలస్యం చేయకుండా నేల ఉసిరి ఆకులను ఎలా ఉపయోగించాలి.? అసలు నేల ఉసిరి వల్ల వచ్చే లాభాలు ఏంటీ.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.నోటి పూత, దంతాల వాపు, దంతాల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను నివారించడంలో నేల ఉసిరి ఆకులు అద్భుతంగా సహాయపడతాయి.ముందుగా నేల ఉసిరి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి.
ఒక గ్లాస్ వాటర్‌లో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.ఉదయాన్నే ఆ నీటిని నోట్లో పోసుకుని మూడు, నాలుగు నిమిషాల పాటు పుక్కలించి ఉమ్మేయాలి.
ఆ తర్వాత మామూలు నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే దగ్గు, తుమ్ములు, జలుబు వంటి సమస్యలతో బాధ పడే వారు, అధిక బరువుతో ఇబ్బంది పడే వారు.ఫ్రెష్‌గా ఉండే నేల ఉసిరి ఆకులను బాగా నమిలి మింగాలి.
లేదా నేల ఉసిరి ఆకులతో తయారు చేసిన కషాయం తీసుకోవాలి.తద్వారా జలుబు, దగ్గు, తుమ్ములు పరార్ అవుతాయి.
శరీరంపై ఏవైనా గాయాలు అయినప్పుడు… నేల ఉసిరి ఆకులను మెత్తగా నూరి ప్రభావిత ప్రాంతంలో పూయాలి.ఇలా చేస్తే గాయాలు త్వరగా తగ్గిపోతాయి.
![Telugu Benefitsnela, Tips, Latest, Nela Usiri-Telugu Health - తెలుగు Telugu Benefitsnela, Tips, Latest, Nela Usiri-Telugu Health - తెలుగు](https://telugustop.com/wp-content/uploads/2021/08/health-benefits-of-nela-usiri-nela-usiri-nela-usiri-for-health-health-tips-good-health-lates.jpg )
కిడ్నీలో రాళ్లు ఉన్న వారు.నేల ఉసిరి ఆకుల నుంచి రసం తీసుకుని రోజుకు రెండు స్పూన్ల చప్పున రెగ్యులర్‌గా తీసుకోవాలి.ఇలా చేస్తే క్రమంగా రాళ్లు కరుగుతాయి.మరియు ఇతర కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా నయం అవుతాయి.ఇక నేల ఉసిరి ఆకులను మెత్తగా నూరి ఉండలుగా చేసి ఉదయం, సాయంత్రం తీసుకుంటే విష జ్వరాలు తగ్గుతాయి.