హుజురాబాద్ బిజెపి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ పేరు ఖాయం అయిపోయింది.రాజేందర్ ప్రత్యర్థిగా టిఆర్ఎస్ తరఫున ఉద్యమ నేపథ్యం ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను కెసిఆర్ ప్రకటించారు.
దీంతో రాజేందర్ మరింత అప్రమత్తం అయ్యారు.అలాగే కాంగ్రెస్ నుంచి కొండా సురేఖను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉండడంతో, తన గెలుపుకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా రాజేందర్ అప్రమత్తమయ్యారు.
తమను అదేపనిగా విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇవ్వకుండా, సెంటిమెంట్ రాజకీయాలు ఉపయోగిస్తూ రాజేందర్ గట్టెక్కాలని చూస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.తాజాగా రాజేందర్ పై టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు.కేసీఆర్ గుండెల మీద తన్నిపోయాడు అంటూ ఈటెల రాజేందర్ ను ఉద్దేశించి హరీష్ విమర్శించడంతో, దీనికి కౌంటర్ గా సరికొత్త గా స్పందించారు.
18 ఏళ్ల పాటు హరీష్, తాను కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నామని, అటువంటిది తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హరీష్ కు కౌంటర్ ఇచ్చారు.టిఆర్ఎస్ ను ఎప్పటికైనా సొంతం చేసుకోవాలి అనేది హరీష్ రావు కల అని, అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు.తనకు టీఆర్ఎస్ లో ఎలాంటి పరిస్థితి వచ్చిందో నీకు కూడా అదే పరిస్థితి వస్తుందని ఈటెల రాజేందర్ హెచ్చరించారు .ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు ఆయన హరీష్ ఇద్దరూ ఒక వర్గంగా పేరు ఉండేది. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో వీరిద్దరూ ఉండేవారని, అందుకే ఇద్దర్ని దూరం పెట్టారు అనే ప్రచారం జరిగింది.
![Telugu Etela Rajendar, Etelarajendar, Hujurabad, Telangana-Telugu Political News Telugu Etela Rajendar, Etelarajendar, Hujurabad, Telangana-Telugu Political News]( https://telugustop.com/wp-content/uploads/2021/08/hujurabad-elections-trs-gellu-srinivasayadav-etela-rajendar.jpg)
దీనికి తగ్గట్లుగానే అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడం , ఆ తర్వాత కాస్త ఆలస్యంగా వీరిద్దరికీ మంత్రి పదవులు దక్కడం వంటివి జరిగాయి.అనూహ్యంగా కొద్ది రోజుల క్రితం రాజేందర్ ను కెసిఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో, అసలు వివాదం మొదలైంది .రాజేందర్ ను ఎదుర్కొనేందుకు కెసిఆర్ హరీష్ అస్త్రాన్ని ఉపయోగిస్తూ ఉండడంతో, కెసిఆర్ దగ్గర తన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు హరీష్ గట్టిగానే రాజేందర్ పై విమర్శలు చేస్తున్నారు.పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన హరీష్ రాజకీయాలు ఎలా ఉంటాయో రాజేంద్ర కు బాగా తెలుసు.
![Telugu Etela Rajendar, Etelarajendar, Hujurabad, Telangana-Telugu Political News Telugu Etela Rajendar, Etelarajendar, Hujurabad, Telangana-Telugu Political News]( https://telugustop.com/wp-content/uploads/2021/08/trs-gellu-srinivasayadav-etela-rajendar-sensational-comments-on-hareesh-rao.jpg)
అందుకే ఆయనపై విమర్శలు చేయడం కన్నా, సెంటిమెంట్ ఉపయోగించి, ఆయన టిఆర్ఎస్ పై ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నారు అనే భావన ప్రజల్లో కలిగేలా చేయగలిగితే, తాను సక్సెస్ అయినట్టే అని బలంగా నమ్ముతున్నారు.అందుకే ఈ విధమైన సెంటిమెంట్ రాజేస్తూ హరీష్ దూకుడుకు కళ్లెం వేసే విధంగా రాజేందర్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు.