బిపర్జోయ్ తుపాను రేపు సాయంత్రం కచ్, కరాచీ మధ్య తీరం దాటనున్న నేపథ్యంలో గుజరాత్, మహారాష్ట్ర ముంబైలోని సముద్రతీర ప్రాంతాల్లో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి.బిపర్జోయ్ భారీ విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తీరాన్ని దాటే సమయంలో సుమారు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం సుమారు 37 వేల మందికి పైగా ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అదేవిధంగా సౌరాష్ట్ర, కచ్ కు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.తుఫాన్ నేపథ్యంలో 17 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఆఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.