కులం మతం అనే తేడాలు రోజురోజుకీ కనుమరుగవుతున్న ఈ రోజుల్లో అక్కడక్కడా పరువు హత్యలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి, తాజాగా ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.అనంతపురం జిల్లా గౌరిబిదనూరు తాలూకాలోని హులికుంట గ్రామంలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీ వీడింది.
ఇక ఈ మృతదేహం విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి.
వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా హిందూపురం మండలం తూముకుంట చెక్ పోస్ట్ వద్ద నివాసముంటున్న రామాంజినమ్మ కుమార్తె సంధ్య హిందూపురానికి చెందిన చంద్రశేఖర్ ప్రేమించుకుంటున్నారు.
వీరిద్దరూ ఇప్పటికే రెండుసార్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మళ్లీ వీరిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఇలా తమ కూతురు ప్రియుడితో వెళ్లి పోవడం కారణంగా పరువు పోతుందని భావించిన ఆ యువతి కుటుంబ సభ్యులు.ఆ యువతిని హత్య చేయాలని ప్లాన్ వేశారు.
అనుకున్నట్లుగానే సదరు యువతిని దారుణంగా హత్య చేసి యువతి మృతదేహానికి బండ రాయిని కట్టి సమీపంలోని చెరువులో పడేసారు.అంతేకాదు ఈ హత్య తమ మీదికి రాకుండా పోలీస్ స్టేషన్ వెళ్లి తమ కూతురు కనిపించడం లేదంటూ కేసు పెట్టారు.
ఇక ఈ కేసు విచారణలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు నిందితులను కటకటాల వెనుకకు తోసారు.