మొక్కజొన్న పంటను( Maize Crop ) ఏడాది పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చు.కాకపోతే వరుసగా మొక్కజొన్నను రెండు పంటలుగా వేయకుండా పంట మార్పిడి పద్ధతి పాటించాలి.
పంట మార్పిడి వల్ల కలుపు తో పాటు వివిధ రకాల తెగుళ్లు( Pests ) సోకే అవకాశం చాలా తక్కువ.కాబట్టి అధిక దిగుబడి పొందడానికి వీలుంటుంది.
మొక్కజొన్న పంటలో ఖరీఫ్ కంటే రబీలో( Rabi ) ఎక్కువ దిగుబడి పొందవచ్చు.రబీలో వేసే పంట వేసవికాలంకు చేతికి వస్తుంది.
కాబట్టి ఇటువంటి పంట నష్టం జరగకుండా ఉంటుంది.దీంతో రైతులు అధిక దిగుబడులు పొందవచ్చు.
![Telugu Corn Crop, Fall Worm, Maize Crop, Maizecrop, Maize Crop Pest, Maizemaize, Telugu Corn Crop, Fall Worm, Maize Crop, Maizecrop, Maize Crop Pest, Maizemaize,](https://telugustop.com/wp-content/uploads/2024/03/Fall-Army-Worm-management-in-Maize-Crop-detailss.jpg)
ఒక ఎకరం పొలానికి 10 టన్నుల పశువుల ఎరువు( Cattle Manure ) లేదంటే కంపోస్ట్ ఎరువులు వేసుకోవాలి.ఖరీఫ్ లో సాగు చేస్తే.వర్షాధార పరిస్థితుల వల్ల నీటిని పారించే అవకాశం చాలా తక్కువ.రబీలో సాగు చేస్తే.వారం రోజులకు ఒకసారి నీటి తడి అందించాలి.మొక్కజొన్న పంటలో శ్రమతో పాటు అనవసరపు పెట్టుబడి వ్యయం తగ్గాలంటే మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.
ఇలా విత్తుకుంటే, మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి ఆరోగ్యకరంగా పెరుగుతున్నాయి.
![Telugu Corn Crop, Fall Worm, Maize Crop, Maizecrop, Maize Crop Pest, Maizemaize, Telugu Corn Crop, Fall Worm, Maize Crop, Maizecrop, Maize Crop Pest, Maizemaize,](https://telugustop.com/wp-content/uploads/2024/03/Fall-Army-Worm-management-in-Maize-Crop-detailsd.jpg)
మొక్కజొన్న పంటకు కత్తెర పురుగుల బెడద కాస్త ఎక్కువ.ఈ పురుగులు పంటను ఆశించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టకపోతే తక్కువ సమయంలోనే మొత్తం మొక్కజొన్న మొక్కల ఆకులు తినేసి పంటను ఆకులు లేని అస్తిపంజరం లాగా మార్చేస్తాయి.ఈ పురుగుల వల్ల పంట దిగుబడి 90 శాతానికి పైగా తగ్గి అవకాశం ఉంది.
ఈ పురుగులను పొలంలో గుర్తించిన తర్వాత ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఒక లీటరు నీటిలో ఐదు మిల్లీలీటర్ల వేపనులను కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.లేదంటే ఒక లీటరు నీటిలో 4గ్రాముల ఇమమెక్టిమ్ బెంజోయేట్ ను కలిపి పిచికారి చేసి ఈ పురుగులను పూర్తిగా అరికడితేనే పంట నష్టం జరగకుండా ఉంటుంది.