ఆర్టికల్ 370 ని రద్దు చేయాలనీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదన తీసుకురావడం,దానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అంగీకరిస్తూ గెజిట్ జారీ చేయడం తో కొన్ని పార్టీలు సంబరాల్లో మునిగిపోగా,కొన్ని పార్టీలు మాత్రం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.అయితే ఇప్పుడు ఈ జాబితా లో నటుడు,మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా చేరిపోయారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ క్రమంలో ఆయన కేంద్రం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది నిరంకుశ చర్యఅని,ప్రజాస్వామ్యం పై జరిగిన దాడి అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.ఆర్టికల్ 370 రద్దు ప్రకటన తో రాజ్యసభ లో పలు పార్టీలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
అయితే దీనిపై కూడా కమల్ వ్యాఖ్యలు చేశారు.కనీసం ప్రతిపక్షాల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోకుండా ,చర్చించే సమయం కూడా ఇవ్వకుండా ఈ విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం పై ఆయన మండిపడ్డారు.
ఈ రద్దుపై కేంద్రం వ్యవహరించిన తీరు వలన ప్రజాస్వామ్యం తిరిగమనదిశగా పయనిస్తుందని కమల్ పేర్కొన్నారు.

మరోపక్క రాజ్యసభ లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ముఖ్యంగా కాంగ్రెస్, డీఎంకే, పీడీపీ పార్టీలు మద్దతును ప్రకటించలేదు.అయితే మిగిలిన చాలా పార్టీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలవడంతో రాజ్యసభలో బిల్లు పూర్తి మెజారిటీతో నెగ్గినట్లు తెలుస్తుంది.రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లును ఈ రోజు లోక్‌సభలో ప్రవేశ పెట్టిన చర్చ జరపనున్నట్లు తెలుస్తుంది.