తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే అందులో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు కానీ, కమర్షియల్ సన్నివేశాలు కానీ లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఎంతో చాకచక్యంగా సినిమాని తెరకెక్కిస్తారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఇలా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయింది.ఇలా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆనంద్, గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ, హ్యాపీ డేస్ వంటి ఎన్నో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇప్పటికీ ఈ సినిమాలను చూస్తే తొలిసారి చూసిన అనుభూతి కలుగుతుంది.ఇలా బాక్సాఫీస్ వద్ద ఎన్నో మంచి విజయాలను అందుకున్న శేఖర్ కమ్ముల చిత్రాలలో ఒకటిగా ఉన్నటువంటి చిత్రం గోదావరి.
ఆనంద్ చిత్రంతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ కమ్ముల ఆ తర్వాత తాను దర్శకత్వం వహించే చిత్రం మరింత ఉన్నతంగా ఉండాలని ఆలోచించాడు.ఈ క్రమంలోనే ఆయన ఈ సినిమా కోసం ఆలోచన చేస్తూ ఉండగా అప్పుడే ప్రముఖ దర్శకుడు బాపుగారు గుర్తుకు వచ్చారు.
బాపు దర్శకత్వంలో 1973 లో వచ్చిన అందాల రాముడు సినిమా అంటే శేఖర్ కమ్ములకి ఎంతో ఇష్టం.గోదావరి అలలపై ఎంతో అద్భుతంగా సాగిపోయిన ఈ చిత్రం అప్పటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
అలాంటి చిత్రం ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా తీయాలని శేఖర్ కమ్ముల ఆలోచించాడు.అలా అందాల రాముడు సినిమా నుంచి పుట్టినదే గోదావరి.ఇందులో సుమంత్, కమలిని ముఖర్జీ ఎంతో అద్భుతంగా నటించారు.అప్పుడే సుమంత్ ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన విషయాలను డిజాస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న సమయంలో శేఖర్ కమ్ముల అతనికి గోదావరి చిత్రాన్ని వినిపించారు.
ఇలా అమెరికాలో సాఫ్ట్ వేర్ చేసి ఇండియాలో రాజకీయాలలోకి రావాలని భావించిన ఓ యువకుడు ఎవరి సహాయం లేకుండా సొంత కాళ్లపై నిలబడి ముక్కుసూటిగా వ్యవహరించే కమలినీ ముఖర్జీ మధ్య గోదావరి అలలపై లాంచీలో ఈ ప్రేమ ప్రయాణం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మధురమైన పాటలను అందించారు కే.యం రాధాకృష్ణన్.ఇలా ఎంతో అద్భుతమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా 2006 మే 19వ తేదీ విడుదలైంది.
ఇదే సమయంలోనే విశాల్ నటించిన పందెంకోడి సినిమా కూడా విడుదలైంది.ఇలా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ పోటీలో నిలబడి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.ఈ విధంగా శేఖర్ కమ్ముల గోదావరి సినిమా విజయం సాధించడం వెనుక బాబు గారు తెరకెక్కించిన అందాల రాముడు చిత్రం ఉందని ఈ సినిమా నుంచే గోదావరి వంటి అద్భుతమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పవచ్చు.