సీనియర్ ఎన్టీఆర్( Sr NTR ) తన మనవడు జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) లోని నటనను త్వరగానే గ్రహించాడు.ఎప్పటికైనా తనను మించిన నటుడు అవుతాడని తారక్ కి తన పేరునే పెట్టాడు.
బాల రామాయణం సినిమాతో తొలిసారిగా వెండితెరపై కనిపించిన తారక్ ని చూసిన తర్వాత ఎవరైనా కూడా తాతను మించే మనవడు అవుతాడని అనుకోకుండా ఉండరు.ఇక ఎన్టీఆర్ కెరియర్ మలుపు తిప్పిన ఎక్కువ చిత్రాలకు సీనియర్ దర్శకుడు దర్శకేంద్రుడు అయిన రాఘవేంద్రరావు( Raghavendra Rao ) కారణం కావడంతో ఆయనకు ఎన్టీఆర్ తో మంచి అనుబందం ఉండేది.
తన మనవడిని హీరోగా నువ్వే చేయాలని ఆనాడే సీనియర్ ఎన్టీఆర్ రాఘవేంద్రరావుని అడిగాడట.
కానీ హరికృష్ణకు( Hari Krishna ) ఈ విషయం తెలియక పోవడంతో రామోజీరావు బ్యానర్ లో నిన్ను చూడాలని( Ninnu Choodalani ) అనే సినిమాను తారక్ హీరోగా మొదలుపెట్టారు.రామోజీరావు కూడా రాఘవేంద్రరావుకి దగ్గర వ్యక్తి కాబట్టి ఆయన పోనీలే అని వదిలేశాడు కానీ రెండవ సినిమా స్టూడెంట్ నెంబర్ 1( Student No.1 Movie ) మాత్రం తానే తీయాలని భావించాడు.ఈ సినిమా రాఘవేంద్రరావు ఆత్మీయుడు అయిన అశ్వినీ దత్ నిర్మాణంలో తెరకెక్కింది.అయితే స్టూడెంట్ నెంబర్ వన్ కథ నచ్చడంతో తాను దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలని అనుకున్నప్పటికీ అది జరగలేదు.
అందుకు గల కారణం అప్పటికే తన దగ్గర సీరియల్స్ కి దర్శకత్వం వహిస్తున్న రాజమౌళిని( Rajamouli ) సైతం దర్శకుడిగా ఒక చిత్రాన్ని చేయించాలని ఈ రాఘవేంద్రరావు అనుకున్నారు.రాజమౌళిని దర్శకుడిగా పెట్టి అశ్వినీ దత్ నిర్మాతగా తన పర్యవేక్షణలో తారక్ రెండవ సినిమా చేయాలని నిర్ణయించుకొని ఆ ప్రయత్నాలు సఫలం కావడంతో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా రూపుదిద్దుకుంది.ఈ సినిమా ద్వారా తారక్ టాలీవుడ్ లోనే మొట్టమొదటి విజయాన్ని అందుకున్నాడు.ఒకరకంగా నిన్ను చూడాలని సినిమా మొదటి సినిమా అయినప్పటికీ హీరోగా విజయాన్ని మాత్రం స్టూడెంట్ నెంబర్ 1 ద్వారానే దక్కించుకోగలిగాడు.
దాంతో సీనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చిన మాట రాఘవేంద్రరావు నెరవేర్చినట్టు అయింది అని అనుకున్నారు.