కాకినాడలో ప్లాంట్ .. రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కోరమాండల్ ఇంటర్నేషనల్

ఎరువుల తయారీలో దిగ్గజంగా పేరుగాంచిన ‘కోరమాండల్ ఇంటర్నేషనల్( Coromandel International )’ ఏపీలో అడుగుపెట్టింది.ఈ మేరకు కాకినాడ వద్ద ఫాస్పరిక్ యాసిడ్ – సల్ఫరిక్ యాసిడ్ కాంప్లెక్స్ ఫెసిలిటీ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.

 Coromandel International To Invest Rs.1000 Crore In Plant In Kakinada , Kakinad-TeluguStop.com

రెండేళ్ల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు కోరమాండల్ ఇంటర్నేషనల్ కంపెనీ తెలిపింది.అంతేకాదు ఈ ఫెసిలిటీ కోసం రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించింది.అయితే ఏప్రిల్ 26వ తేదీన ఈ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.

కాగా రోజుకు సుమారు 650 టన్నుల తయారీ సామర్థ్యంతో ఫాస్పరిక్ యాసిడ్ ను ఉత్పత్తి చేసే విధంగా కంపెనీ రూపుదిద్దుకోనుంది.అదేవిధంగా రోజుకు దాదాపు 1,800 టన్నుల సామర్థ్యం గల సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటు సైతం ఇక్కడ కొలువుదీరనుంది.

ఈ క్రమంలోనే కాకినాడ ప్లాంటు( Kakinada Plant ) దిగుమతి చేసుకుంటున్న యాసిడ్ అవసరాల్లో ప్రతిపాదిత కేంద్రం సగానికి పైగా భర్తీ చేస్తుందని.ఎరువుల తయారీకి కావాల్సిన ఫాస్పరిక్ యాసిడ్ ను సరఫరా చేస్తుందని సంస్థ ప్రకటించింది.

అయితే.కాకినాడ వద్ద ఉన్న కోరమాండల్ ప్లాంటు ఫాస్ఫటిక్ ఫెర్టిలైజర్( Phosphate Fertilizers ) తయారీలో యావత్ దేశంలోనే రెండవ అతి పెద్దది కావడం విశేషం.దీని సామర్థ్యం సుమారు 20 లక్షల టన్నులు.అంతేకాదు దేశ వ్యాప్తంగా తయారు అవుతున్న ఫాస్ఫరస్, నత్రజని మరియు పొటాషియం ఆధారిత ఎరువుల పరిమాణంలో కోరమాండల్ కాకినాడ ప్లాంట్ 15 శాతం వాటా కలిగి ఉందని తెలుస్తోంది.

డీఏపీ, ఎన్కేపీ ఎరువుల తయారీలో రెండు ఉత్పత్తులు కీలక ముడి పదార్థాలు.ఈ నేపథ్యంలో కాకినాడ ప్లాంట్ కు అవసరమైన ఫాస్పరిక్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అవసరాల్లో రెండు ప్లాంట్లు 50 శాతం తీరుస్తాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube