కరివేపాకు( Curry leaves ) అంటే తెలియని వారుండరు.పురాతన కాలం నుంచి వంటల్లో కరివేపాకును విరివిరిగా వాడుతున్నారు.
ఆహారం రుచిని పెంచడానికి కరివేపాకు ఎంతో బాగా సహాయపడుతుంది.అలాగే కరివేపాకులో పోషకాలు మెండుగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
అంతేకాదు జుట్టు సంరక్షణకు సైతం కరివేపాకు తోడ్పడుతుంది.ముఖ్యంగా కరివేపాకుతో ఇప్పుడు చెప్పబోయే విధంగా హెయిర్ గ్రోత్ సీరం ను తయారు చేసుకుని వాడితే అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం కరివేపాకుతో సీరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక కప్పు కరివేపాకుని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో కడిగి పెట్టుకున్న కరివేపాకు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water )వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ సపరేట్ చేసుకోవాలి.
ఈ కరివేపాకు జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన సీరం అనేది సిద్ధమవుతుంది.
ఈ న్యాచురల్ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.సీరం అప్లై చేసుకున్న గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ కరివేపాకు సీరం ను వాడితే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.వయసు పైబడినా తెల్ల జుట్టు సమస్యకు దూరంగా ఉండొచ్చు.అలాగే ఈ సీరం హెయిర్ ఫాల్ సమస్యను సమర్థవంతంగా అరికడుతుంది.
అదే సమయంలో హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది.జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.
కురులు ఒత్తుగా ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.