తెలంగాణలోని 17 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరగబోతుండడంతో, హోరాహోరీగా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంపైనే పూర్తిగా ఫోకస్ చేశాయి.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు బీఆర్ఎస్, బిజెపి , కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగానే పోటీ పడుతున్నాయి.ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో, 17 స్థానాల్లో కనీసం 12 నుంచి 14 స్థానాల్లోనైన తాము విజయం సాధిస్తామనే నమ్మకంతో కాంగ్రెస్ ఉండగా, ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుని తెలంగాణలో బీఆర్ఎస్( BRS ) ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని, కాంగ్రెస్ పై జనాల్లో వ్యతిరేకత మొదలైందని నిరూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.
దీనిలో భాగంగానే గత కొద్ది రోజులుగా బస్సు యాత్రల పేరుతో జనాలకు దగ్గరయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.తన బస్సు యాత్రకు తెలంగాణ ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని కేసిఆర్( KCR ) అంచనా వేస్తున్నారు.ఇక బస్సు యాత్ర షెడ్యూల్ లో భాగంగా నేడు ఖమ్మం జిల్లాలోని తల్లాడ, జూలూరుపాడు, కొత్తగూడెం ( Tallada, Julurupadu, Kothagudem )ప్రాంతాల్లో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది.
సాయంత్రం కెసిఆర్ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది.ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది.బస్సు యాత్ర నేపథ్యంలో 12 లోక్ సభ నియోజకవర్గాల్లో కెసిఆర్ రోడ్ షోలలో పాల్గొననున్నారు.
ఈ బస్సు యాత్ర మే 10 న సిద్దిపేటలో ముగుస్తుంది.ఈ పర్యటనలో కెసిఆర్ రోడ్ షోలలో మాత్రమే కాకుండా, ఎక్కడకక్కడ ప్రజలతో మమేకం అయ్యేవిధంగా షెడ్యూల్ రూపొందించుకున్నారు.ఉదయం రైతులు, మహిళలు, యువకులు, దళితులు, గిరిజనులతో ప్రత్యేకంగా సమావేశం అవుతూ.
బి ఆర్ ఎస్ పై జనాల్లో ఆదరణ పెరిగే విధంగా మరింత ముమ్మరం చేస్తున్నారు.