మీరు ఎప్పుడైనా విన్నారా చనిపోయిన ఒక జీవి మరొక జీవిని చంపింది అని.అయితే ఇపుడు వినండి.
చనిపోయింది అనుకున్న ఒక పాము ఒక వ్యక్తిని కాటు వేయడంతో అతడు మరణించాడు.వినడానికి ఆశ్చర్యం కలిగినా ఇదే నిజం.
నిజంగా ఒక చనిపోయిన పాము తిరిగి లేచి మళ్ళీ కాటు వేయడంతో ఒక వ్యక్తి మరణించిన ఘటన చైనా లో జరిగింది.
చైనాలో ఒక హోటల్ లో ఈ దారుణం జరిగింది.
హోటల్ పని చేస్తున్న చెఫ్ ను కోబ్రా కాటేసి చంపేసింది.ఆ పామును హోటల్ లో సూప్ చేయడానికి తీసుకుని వచ్చారు.
అది చనిపోయిన పాము అనుకున్నారు.కానీ ఆ పాము ఆ చెఫ్ ను కాటు వేసింది.
చనిపోయిన పాము ఎలా కారు వేసిందా అనే కదా మీ డౌట్.ఆగండి.
అసలు మ్యాటర్ ఏంటంటే.
పెంగ్ రెస్టారెంట్ లో కోబ్రా సూప్ తయారు చేస్తారు.
అక్కడి ప్రజలకు ఆ కోబ్రా సూప్ అంటే చాలా ఇష్టం.ఈ హోటల్ లో కోబ్రా సూప్ చేయడం కోసం కోబ్రాను తీసుకుని వచ్చారు.
ఆ చెఫ్ దానిని సూప్ చేయడం కోసం ఆ కోబ్రాను కట్ కూడా చేసాడు.కానీ కట్ చేసిన పాము ఒక్కసారిగా అతడిని కాటు వేసింది.ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా.ఆ పాము తలభాగం డస్ట్ బిన్ లో వేద్దాం అని ఆ చెఫ్ పట్టుకోవడంతో అతడిని కాటేసింది.

అతడిని కాటేసిన తర్వాత యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్ తీసుకు రావడం ఆలస్యం అవ్వడంతో విషం శరీరమంతా పాకడంతో అతడు అక్కడే మరణించాడు.అక్కడికి కోబ్రా సూప్ తాగడానికి వచ్చిన వారంతా ఈ ఘటనను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు స్పందించారు.

కోబ్రా చనిపోయిన తర్వాత కూడా కనీసం అరగంట అయినా తల భాగం బ్రతికే ఉంటుందట.అందుకే తలను పట్టుకోవడంతో ఆ కోబ్రా కాటేసిందని అధికారులు చెబుతున్నారు.ఇదండీ విషయం.
చనిపోయిన పాము ఎలా కాటు వేసిందో తెలుసుకున్నారు కదా.