వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ముందస్తు ఎన్నికల కు సంబంధించిన హడావుడి, సందడి వాతావరణం నెలకొంది.ప్రస్తుతం వైసీపీకి 151 మందితో పాటు, అదనంగా టిడిపి , జనసేన సభ్యులు కొంతమంది మద్దతు ప్రకటిస్తూ ఉండడంతో తిరుగులేని శక్తిగా ఏపీలో ఉంది.
దీనికి తోడు పెద్దఎత్తున ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతున్న తీరు, రాబోయే ఎన్నికలకు ఎటువంటి ఇబ్బంది లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.క్షేత్రస్థాయిలో జగన్ పర్యటనలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
అలాగే సంక్షేమ పథకాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పెద్దఎత్తున నిధులు కేటాయింపు చేస్తూ, వాలంటీర్లు అధికారుల ద్వారా ప్రజా సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగే విధంగా ప్లాన్ చేశారు.ఏ రకంగా చూసుకున్నా ఏపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.
అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం వెళ్తోంది అనే ప్రచారం ఊపందుకుంది.
పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు మాత్రమే అవుతుంది .ఇంకా ప్రభుత్వం నడిచేందుకు ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా, ఇప్పటికిప్పుడు ఈ ముందస్తు హడావుడి గురించి నేతల మధ్య చర్చకు వస్తోంది.అయితే నిజంగా ఎన్నికలకు ఇప్పట్లో వెళ్లే ఆలోచనలో జగన్ లేకపోయినా, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీతోనూ ప్రభుత్వం తోనూ తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ సొంత వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టే కార్యక్రమాల్లో బిజీగా ఉండడం, వంటి కారణాలతో జనాలు పార్టీ నాయకులపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ వరకు వెళ్ళింది .అందుకే ఈ పరిస్థితి నుంచి పార్టీ నాయకులను మంత్రులు , ఎమ్మెల్యేలు బయటపడేసేందుకు ముందస్తు ఎన్నికలు వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.ఇప్పట్లో ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేకపోయినా, ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అంటే ఇప్పటి నుంచి నాయకులు బలం పెంచుకునేందుకు రకరకాల మార్గాల్లో ప్రయత్నాలు చేస్తారని, పార్టీ కార్యక్రమాలను, విధానాలను జనాల్లోకి తీసుకు వెళ్తారనే ఆలోచనతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతోంది.