మోదీని వెంటాడుతున్న గుజరాత్‌ అల్లర్లు

ఒకప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ భారీ మెజారిటీతో ప్రధాని పీఠం అలంకరించి అంతోడు ఇంతోడు అంటూ మీడియాలో విస్తృత ప్రచారం పొందుతున్నప్పటికీ గోద్రా నరమేధం, గుజరాత్‌ మత ఘర్షణలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.ఈ చీకటి అధ్యాయం ఇంకా మరుగున పడిపోలేదు.

 Sikh Group Seeks Prosecution Of Modi-TeluguStop.com

మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఈ మారణ హోమం కారణంగానే చాలా ఏళ్లపాటు అమెరికా ఆయన్ని తమ దేశానికి రానివ్వకుండా బ్లాక్‌ లిస్టులో పెట్టింది.ప్రధాని అయ్యాకే అమెరికా వెళ్లడం సాధ్యమైంది.

తాజాగా ఇప్పడు మళ్లీ ఈ ఇష్యూ తెర మీదికి వచ్చింది.ప్రధాని మోదీ విదేశాల పర్యటనకు బయలుదేరారు.

ఆయన పర్యటనలో కెనడా కూడా ఉంది.వచ్చేవారం అక్కడ పర్యటిస్తారు.

దీంతో అక్కడి సిక్కు గ్రూపులు మోదీని టార్గెట్‌ చేసుకున్నాయి.రెండువేల రెండో సంవత్సరంలో జరిగిన గుజరాత్‌ మత ఘర్షణలకు కారకుడైన మోదీని ప్రాసిక్యూట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.‘మోదీ ఇండియాస్‌ ప్రైమ్‌ మర్డరర్‌’ (మోదీ భారత్‌కు చెందిన ప్రధాన హంతకుడు) అని వాల్‌పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు.సిఖ్‌ ఫర్‌ జస్టిస్‌ అనే గ్రూపు కెనడియన్‌ అటార్నీ జనరల్‌ కమ్‌ న్యాయ శాఖ మంత్రి పీటర్‌ మాకెను కలిసి పదహారు పేజీల ఫిర్యాదు సమర్పించింది.

ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేయాలని కోరింది.మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు ఇదే గ్రూపు అక్కడ పిటిషన్‌ దాఖలు చేసింది.ఇతర దేశాల్లో నేరాలు చేసిన వ్యక్తులను కెనడాలో విచారించే అధికారం కెనడియన్‌ న్యాయవ్యవస్థకు ఉందని సిక్కు గ్రూపు తెలియచేసింది.నలభై రెండేళ్ల తరువాత భారత ప్రధాని కెనడా వెళ్లడం ఇదే మొదటిసారి.

మరి మోదీని అక్కడ ఏం చేస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube