విజయవాడ వరద బాధితుల సహాయార్థం వైసిపి అధినేత జగన్( YCP chief Jagan ) ప్రకటించిన కోటి రూపాయల విరాళం పై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది.విజయవాడ నగరంలో సంభవించిన వరదల కారణంగా అక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో , స్వయంగా జగన్ వెళ్లి బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కోటి రూపాయల సహాయాన్ని జగన్ ప్రకటించారు.అయితే రోజులు గడుస్తున్నా జగన్ చేసిన ప్రకటన మేరకు ఆ కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇంకా అందించకపోవడం పై మీడియా, సోషల్ మీడియాలో జగన్ ను టార్గెట్ చేస్తూ అనేక ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.
ముఖ్యంగా టిడిపి , జనసేన ( TDP, Jana Sena )క్యాడర్ జగన్ కోటి రూపాయల సాయం పై అనేక ప్రశ్నలు, విమర్శలు చేస్తున్నారు.
విజయవాడ వరదల తో అష్ట కష్టాలు ఎదుర్కొంటున్నా.అక్కడ ప్రజలను ఆదుకునేందుకు ఎంతోమంది ప్రముఖులు, వ్యాపారస్తులు సినీ రంగాలకు చెందినవారు సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీగా విరాళాలను ప్రకటించి చెక్కుల రూపంలో ఇస్తున్నారు .మరి జగన్ ఇంకెప్పుడు ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు.తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) తనదైన శైలిలో స్పందించారు.జగన్ ప్రకటించిన కోటి రూపాయల సాయం సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడానికి కాదు అని, మా పార్టీ తరపున వరద బాధితులకు సహాయ సహకారాలు చేయడానికి అని బొత్స తేల్చి చెప్పారు.
మాకు కేడర్ ఉంది, పార్టీ ఉంది అందువల్ల మేము మొత్తాన్ని ప్రజలకి నేరుగా వివిధ అవసరాల నిమిత్తం వెచ్చిస్తామని బొత్స అన్నారు.జగన్ ఇప్పటికే కోటి రూపాయలు అందించారని, అంతేకాకుండా మరో 10 లక్షల రూపాయలు తాజాగా ఇచ్చారని ప్రకటించారు.సీఎం రిలీఫ్ ఫండ్ కి నేరుగా తాము చెక్కులు ఇవ్వమని బొత్స తేల్చి చెప్పారు.