ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్( CM Jagan ) ముఖ్యమంత్రి అయ్యాక వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడం తెలిసిందే.వాలంటీర్ల వ్యవస్థ( Volunteer System ) ద్వారానే చాలావరకు ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు అందాల్సిన పథకాలు అందిస్తూ వస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో( YCP ) వాలంటీర్ వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.అటువంటి వాలంటరీ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మేటర్ లోకి వెళితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ తరపున వాలంటీర్లు ప్రచారం చేశారని ఆరోపించారు.

ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి లెటర్ కూడా రాయడం జరిగింది.ప్రభుత్వ సొమ్ము ఇచ్చి పార్టీ పనులు చేయించుకోవడం ఇదే తొలిసారి అంటూ అచ్చెనాయుడు ( Atchennaidu ) ఆగ్రహం వ్యక్తం చేశారు.వాలంటీర్లకు ప్రతి ఏడాది 2000 కోట్లు రూపాయలు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ పాలన సరైన రీతిలో నడిచే విధంగా వాలంటీర్లను కట్టడి చేయాలని లేఖలో స్పష్టం చేశారు.వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడంతో వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగం కాకుండా తగు జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర సిఎస్ కి అచ్చెనాయుడు లెటర్ రాయడం జరిగింది.







