మూడు గోలలో కడప కుమ్మేసింది.. మిగిలిన వాళ్ల కంట్లో దుమ్ము కొట్టారు!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మూడు రాజధానుల గోలే నడుస్తోంది.ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే సాక్షాత్తూ అసెంబ్లీలోనే మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అని ప్రశ్నించినప్పటి నుంచీ పార్టీలు, ప్రజల దృష్టంతా ఈ అంశంపైనే ఉంది.

 Cm Ys Jagan Gives 15000 Cr Fund For Kadapa Development-TeluguStop.com

దీనిపై చర్చల మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి.ఇదే అదును అన్నట్లుగా అటు అధికారులు మాత్రం తమ స్వామి భక్తి ప్రదర్శిస్తూ.

సీఎం జిల్లాపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు.

ఒకటి కాదు.

రెండు కాదు.గత వారం రోజుల్లోనే సీఎం సొంత జిల్లా కడపకు సుమారు రూ.1500 కోట్ల విలువైన పనులకు నిధులు విడుదల చేయడం గమనార్హం.ఓవైపు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం.

రాజధాని అమరావతిని నిర్మించడానికి డబ్బుల్లేవంటూనే జగన్‌ ఈ మూడు రాజధానులను ప్రతిపాదించారు.

Telugu Cr Kadapa, Amaravathi, Chandrababu, Cm Ys Jagan-Telugu Political News

కానీ సొంత జిల్లాకు మాత్రం కోట్లకు కోట్లు ఇవ్వడానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ ఎదురు కావడం లేదు.వారం రోజులుగా అంతా రాజధానులపై చర్చించుకుంటూ ఉంటే.అధికారులు మాత్రం చడీచప్పుడు కాకుండా రూ.1500 కోట్ల విలువైన పనులకు నిధులు మంజూరు చేస్తూ ఏకంగా 30 ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.

Telugu Cr Kadapa, Amaravathi, Chandrababu, Cm Ys Jagan-Telugu Political News

పులివెందులతోపాటు పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు భారీగా నిధులు మంజూరయ్యాయి.కడప మెడికల్‌ కాలేజీకి రూ.125 కోట్లు, అక్కడే మెంటల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు రూ.40 కోట్లు, వైఎస్‌ఆర్‌ ఏరియా హాస్పిటల్‌ను 300 పడకల ఆసుపత్రిగా మార్చడానికి రూ.347 కోట్లు, హోంశాఖ ఆధ్వర్యంలో ఐదు భవనాల నిర్మాణానికి రూ.20.95 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

కడప కార్పొరేషన్‌ను సుందరీకరించడానికి రూ.55 కోట్లకు ఆమోదం రావడాన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీకి రూ.29 కోట్లు ఇవ్వనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube