మూడు గోలలో కడప కుమ్మేసింది.. మిగిలిన వాళ్ల కంట్లో దుమ్ము కొట్టారు!
TeluguStop.com
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మూడు రాజధానుల గోలే నడుస్తోంది.ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే సాక్షాత్తూ అసెంబ్లీలోనే మూడు రాజధానులు ఉంటే తప్పేంటి అని ప్రశ్నించినప్పటి నుంచీ పార్టీలు, ప్రజల దృష్టంతా ఈ అంశంపైనే ఉంది.
దీనిపై చర్చల మీద చర్చలు నడుస్తూనే ఉన్నాయి.ఇదే అదును అన్నట్లుగా అటు అధికారులు మాత్రం తమ స్వామి భక్తి ప్రదర్శిస్తూ.
సీఎం జిల్లాపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు.ఒకటి కాదు.
రెండు కాదు.గత వారం రోజుల్లోనే సీఎం సొంత జిల్లా కడపకు సుమారు రూ.
1500 కోట్ల విలువైన పనులకు నిధులు విడుదల చేయడం గమనార్హం.ఓవైపు రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో చూస్తూనే ఉన్నాం.
రాజధాని అమరావతిని నిర్మించడానికి డబ్బుల్లేవంటూనే జగన్ ఈ మూడు రాజధానులను ప్రతిపాదించారు. ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2019/12/CM-YS-Jagan-Gives-15000-Cr-Fund-For-Kadapa-Development-కడప-కుమ్మేసింది-1!--jpg"/కానీ సొంత జిల్లాకు మాత్రం కోట్లకు కోట్లు ఇవ్వడానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ ఎదురు కావడం లేదు.
వారం రోజులుగా అంతా రాజధానులపై చర్చించుకుంటూ ఉంటే.అధికారులు మాత్రం చడీచప్పుడు కాకుండా రూ.
1500 కోట్ల విలువైన పనులకు నిధులు మంజూరు చేస్తూ ఏకంగా 30 ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2019/12/CM-YS-Jagan-Gives-15000-Cr-Fund-For-Kadapa-Development-కడప-కుమ్మేసింది!--jpg"/పులివెందులతోపాటు పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు భారీగా నిధులు మంజూరయ్యాయి.కడప మెడికల్ కాలేజీకి రూ.