ఇప్పుడు ఇగోలు అవసరమా పవన్ ?

దేశమంతా కరోనా పంజా విసురుతోంది.ఈ వైరస్ దాటికి వేలాది మంది గురవ ఈ వ్యాధి సోకిన వారు కూడా భయంతో విలవిల్లాడుతున్నారు.

 Pawan Kalyan, Jagan, Ap Cm, Coronavirus, Immigrants, Lockdown-TeluguStop.com

ఈ కష్టం నుంచి గట్టెక్కించే మార్గం ఇప్పట్లో కనిపించక అంతా ఆందోళనలో ఉన్నారు.ఇక ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉండడంతో సమస్య తీవ్రతను కూడా మరిచిపోయి, ఒక దేశానికి మరో దేశం సహకరించుకుంటున్నాయి.

అలాగే మన దేశంలోనూ, అన్ని రాష్ట్రాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లుగా నడుచుకుంటూ ఐక్యతను ప్రదర్శిస్తున్నాయి.ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ప్రజలకు వచ్చిన ముప్పు.

ఈ సమయంలో కలిసికట్టుగా ఉండి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఈ సమయంలో రాజకీయాలకు అతీతంగా అంతా ఒక్కటే, ప్రభుత్వాలకు, ప్రజలకు సహకరిస్తూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి.

ఈ విపత్కర సమయంలోనూ ఇగో లు చూపిస్తూ సొంత రాజకీయాలు చేస్తే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది.

ఇక విషయానికి వస్తే, కరోనా ను కట్టడి చేసే విషయంలో ఉన్నంతలో ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది.

ప్రజలు ఎవరు రోడ్ల మీదకు రాకుండా చేయడంతోపాటు, కరోనా బాధితులకు సత్వర చికిత్స, లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలు చేయడమే ప్రస్తుతం కనిపించే నివారణ మార్గం గా ఉండడంతో వైసీపీ ప్రభుత్వం ఆ విధంగానే ముందుకు వెళుతుంది.అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించాల్సిన రాజకీయ పార్టీలు యధావిధిగా విమర్శలు చేస్తూ విమర్శల పాలు అవుతున్నాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ,కరోనా వైరస్ ను కట్టడి చేసే విషయంలో తన వంతు బాధ్యతగా రెండు కోట్ల వరకు ప్రభుత్వాలకు విరాళాలు ఇచ్చారు.ఇంత వరకు బాగానే ఉన్నా, వైసీపీ ప్రభుత్వం తో ఉన్న రాజకీయ వైరుధ్యం కారణంగా ఇప్పుడు జగన్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవడం పవన్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Ap Cm, Coronavirus, Jagan, Lockdown, Pawan Kalyan-Telugu Political News

మొదటి నుంచి వైసీపీ అధినేత జగన్ విషయంలో పవన్ తీరు ఇదే రకంగా ఉంటూ వస్తోంది.ఆయన ఏది చేసిన తప్పు అన్నట్టుగానే పవన్ వ్యవహరిస్తూ ఉంటారు.దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలంటూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది.అయితే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న విషయం పవన్ కు తెలిసినా, వలస కార్మికులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నట్లుగా పవన్ విమర్శలు చేస్తున్నారు.

వాస్తవంగా చెప్పుకుంటే దేశం మొత్తం మీద వలస కార్మికులు అంద్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఉన్నారు.లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు.పవన్ కళ్యాణ్ మాత్రం వారిని ఏపీకి పంపించాలి అంటూ ఇతర రాష్ట్రాల సీఎం లకు లేఖలు కూడా పంపించారు.కానీ ఏపీ విషయం వచ్చేసరికి కేవలం విమర్శలతో సరిపెడుతున్నారు.

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్లు జగన్ కూడా లెటర్ రాయడం, విజ్ఞప్తి చేయడం చేసి ఉంటే బాగుండేది.కానీ అవి చేయకుండా కేవలం విమర్శ మాత్రమే నేను చేస్తాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇదే పవన్ ను విమర్శల పాలుచేస్తోంది.మిగతా రాష్ట్రాల విషయంలో సానుకూలంగా ఉన్న పవన్, ఏపీ ప్రభుత్వ విషయంలో మాత్రం ఇగో చూపించడం పై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube