రాజకీయ పార్టీ అన్న తర్వాత అనేక వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ప్లాన్లు ఉంటాయి.వాటన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వరు.
నిత్యం రాజకీయ నేతలు చుట్టూ తిరిగే మీడియాలకు అయితే ఏం చెప్పాలో అదే చెప్తారు తప్ప అంతర్గత వ్యవహారాలను మాత్రం అస్సలు తెలియనివ్వరు.కానీ కొన్ని సార్లు రాజకీయ పార్టీల వ్యూహాలు బయటకు వచ్చేస్తుంటాయి.
దీంతో ఇది కాస్తా ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారుతుంది.ప్రత్యర్థులకు తెలియడంతో ఆ పార్టీ రాజకీయంగా వెనకబడిపోతుంది.
ఇప్పుడు ఏపీ బీజేపీ పరిస్థితి కూడా ఇలాగే తయారవుతోంది.
ప్రస్తుతం ఏపీ బీజేపీలో ఒక లీకు వీరుడు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
బీజేపీలోనే దీని మీద జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి.
మొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిరుపతిలో పర్యటించిన విషయం విదితమే.ఆయన ఈ పర్యటన సందర్భంగా ఏపీ బీజేపీ నేతలతో చివరిరోజు భేటీ అయ్యారు.
అయితే అత్యంత కొద్ది మంది మాత్రమే ఈ భేటీకి వచ్చారు.ఇందులో టీడీపీతో ఎలా వ్యవహరించాలో, అలాగే అధికార వైసీపీ పార్టీపై ఎలా ముందుకు వెళ్లాలో దిశా నిర్ధేశం చేశారు.
కాగా అంతర్గత రహస్యాలను కాకుండా ప్రజలకు తెలియజేయాల్సిన కొన్ని విషయాలను సోము వీర్రాజు మీడియాకు చెప్పాలనుకున్నారంట.

ఇక భేటీ అయిన రోజు పొద్దు పోవడంతో ఆయన పొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని అనుకున్నారు.ఇక రాత్రి తిరుపతిలోనే బస చేసిన ఆయనకు పొద్దున్నే పెద్ద షాక్ తగిలిందంట.ఎందుకంటే ఆయన చెప్పాలనుకున్న విషయాలు పొద్దున అన్ని పేపర్లలో వచ్చేశాయి.
పైగా కొన్ని రహస్య విషయాలను కూడా పేపర్లు ముద్రించేశాయి.దీంతో కావాలనే ఎవరో లీక్ చేశారనే వాదన అందరినీ కలిచి వేస్తోంది.
ఇక దీనిపై విశ్వాసపాత్రులను కూడా సోము ఫోన్ చేసి ప్రశ్నించారంట.ఇలా ఎలా బయటకు వచ్చాయంటూ కడిగి పారేశారంట.
కానీ ఆ లీకు వీరుడు ఎవరో ఇప్పటికీ తెలియలేదని సమాచారం.కానీ ఇకనుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని సోము ఫిక్స్ అయ్యారంట.