బెజవాడ టీడీపీలో అనూహ్య పరిణామం తెరమీదికి వచ్చింది.మైనార్టీ నాయకుడు.
మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.ఇంటి నుంచే పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు వచ్చారు.
గత ఎన్నికల్లో ఆయన పశ్చిమ టికెట్‌ను తన కుమార్తె షబానా కు ఇప్పించుకున్నారు.అయితే, ఆమె సక్సెస్ కాలేక పోయారు.
అనంతరం జలీల్ ఖాన్ అనారోగ్యం కారణంతో ఇంటికే పరిమితమయ్యారు.ఇక, అప్పటి నుంచి మౌనంగా ఉన్న ఆయ న తాజాగా ఇంటి నుంచే పార్టీ శ్రేణులను నడిపించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఎంపీ కేశినేని నానికి ప్రధాన మద్దతు దారుగా వ్యవహరిస్తున్న జలీల్ ఖాన్.గత ఎన్నికల్లో నాని నుంచి ఆర్థి క సాయం కూడా పొందారని టాక్ ఉంది.
అదేసమయంలో నాని కుమార్తె శ్వేత పేరును మేయర్ గా బలపరిచిన వారిలో జలీల్ ముందున్నారని అంటున్నారు.దీంతో ఇప్పుడు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో పశ్చి మ నియోజకవర్గంలో పార్టీని నడిపించే వారు నానికి యాంటి అయ్యారు.
ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నానిపై ఫైరవుతున్నారు.ఆయన పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాయకుడే అయినా.
పార్టీపై పట్టులేదు.

నగర ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ.బుద్దా వెంకన్నకు పెద్దగా కేడర్ లేదు.ఈ నేపథ్యంలోనే నానిపై వచ్చిన వ్యతిరేకతకు చెక్ పెట్టేలా మైనార్టీ నాయకుడు.
పశ్చిమలో మంచి పలుకుబడి ఉన్న జలీల్ ఖాన్‌ను నాని రంగంలోకి దింపారని అంటున్నారు.ఆయన దూకుడు పెంచారని.
ఇక, తమకు తిరుగు లేదని.నాని వర్గం కూడా అంటోంది.
తాజాగా లైన్‌లోకి వచ్చిన జలీల్. మంత్రి వెలంపల్లి టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన అన్ని వనరులను దోచుకుంటున్నారని.అవినీతికి మారుపేరుగా మారారని.వ్యాఖ్యానించారు.పశ్చిమ నియోజకవర్గంలో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
జలీల్‌కు మంచి ఫేమ్ ఉండడంతో ఇది తనకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎంపీ వర్గం భావిస్తోంది.మరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.