అత్యంత సర్వ సాధారణంగా ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో బ్లాక్ హెడ్స్ ( Blackheads )ఒకటి.చర్మం పై చాలా చిన్న సైజులో వచ్చే నల్లటి మచ్చల్నే బ్లాక్ హెడ్స్ అని అంటారు.
చర్మ రంధ్రాల్లో మృత కణాలు పేరుకుపోవడం వల్ల ఇవి ఏర్పడతాయి.కొందరిలో ఇవి తక్కువగా ఉంటాయి.
కానీ కొందరిలో మాత్రం బ్లాక్ హెడ్స్ చాలా అధికంగా ఉంటాయి.ముఖ్యంగా ముక్కు, ఫోర్ హెడ్, గడ్డం వంటి భాగాల్లో బ్లాక్ హెడ్స్ కనిపిస్తుంటాయి.
మిమ్మల్ని కూడా బ్లాక్ హెడ్స్ బాగా వేధిస్తున్నాయా.? అయితే అసలు చింతించకండి.

ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ అండ్ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇరవై నిమిషాల్లో వాటిని వదిలించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ సింపుల్ హోమ్ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్,( Coffee powder ) వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు,( Curd ) రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్, సరిపడా రోజ్ వాటర్( Rose water ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి కాస్త మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీతో ఆల్మోస్ట్ చర్మం పై ఏర్పడిన బ్లాక్ హెడ్స్ అన్ని తొలగిపోతాయి.అలాగే డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవుతాయి.చర్మం తెల్లగా ఆకర్షణీయంగా మారుతుంది.డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.
స్కిన్ ఎంత డల్ గా ఉన్నా సరే కేవలం ఇరవై నిమిషాల్లోనే సూపర్ గ్లోయింగ్ గా మెరుస్తుంది.