చంద్రబాబు గద్దె ఎక్కిననుంచి అదేపనిగా ప్రజాధనం దుర్వినియోగం చేయడంలో వెనుకాడడంలేదు .అక్కడితో ఆగకుండా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటున్నారు .
ఉన్న మంచి ఇల్లును కాదని ,కూల్పించి కొత్త నిర్మాణం చేపట్టారు రాజధాని ప్రాంతంలో రైతులను చెట్ల కింద పోమ్మన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బాబు తీరును విమర్శించారు .చంద్రబాబు ఇంటికయ్యే ఖర్చు రాజధానికి విరాళం ఇస్తే ఎంతో బావుండేది .టీడీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పారితోషికాలు విరాళాలు ఇవ్వకుండా ప్రజలను చందాలు అడగడం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు.ఎవరిని ఉద్దరించడానికి ఇలా ప్రజలను, ఉద్యోగులను ఒక రోజు జీతాలు ,ఇమ్మని కోరుతున్నారు అని ఆయన ఎద్దేవా చేసారు .ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిముందు ధర్నా చేసైనా నిధులు తీసుకురావాలని, ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురిచేయరాదని రామకృష్ణారెడ్డి చంద్రబాబు సర్కార్ ను కోరారు .