తిరుపతి: బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ.హిందూ దేవాలయాలపై ఎక్కడ అసత్య ప్రచారం చేసినా ముందుంటా.
దేశంలోని హిందూ దేవాలయాలు ఎక్కడా ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు.బ్రాహ్మణులే వంశపారపర్యంగా అర్చకత్వానికి అర్హులు అనడం సరికాదు.
పురాణాల్లో విశ్వామిత్రుడు, వాల్మీకిలు బ్రాహ్మణులు కాకపోయినా ప్రచారం చేసి మహాత్ముడిగా ఆధ్యాత్మిక ప్రచారం చేశారు.భారత దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారు.
హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నాను.
అనువంశిక అర్చకత్వంకు నేను వ్యతిరేకం.
రమణ దీక్షితుల ట్వీట్ లు నేను గమనించలేదు.దేశంలోని నాలుగు లక్షల హిందూ దేవాలయాలపై అసత్య ఆరోపణలు చేస్తే సహించను, న్యాయపోరాటం చేస్తా.
టీటీడీ వెబ్ సైట్ లో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారన్న ఒక పత్రిక ఆరోపణలపై టీటీడీ ఈవో విజ్ఞప్తి మేరకు కేసు వేశాను.అసత్య వార్తలు రాసిన తెలుగు దినపత్రిక క్షమాపణ చెప్పాలి, 100 కోట్లు జరిమాన చెల్లించాలి.
తమిళనాడులో కరుణానిధి అన్నాడీఎంకే పార్టీల పాలన దరిద్రంగా సాగింది.స్టాలిన్ పాలన నేను సరిగ్గా చూడలేదు.