ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.
ఇక తెలుగులో ఆరు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఆరవ సీజన్ పూర్తిగా ఫ్లాప్ అయిన విషయం మనకు తెలిసిందే.అయితే ఏడవ సీజన్(Bigg Boss 7) చాలా పక్కాగా ప్లాన్ చేస్తూ సక్సెస్ అందుకోవాలని మేకర్స్ భావించినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ షో ఇప్పటికే ప్రసారం కావాల్సి ఉండగా ఆలస్యం అవుతూ వస్తోంది.ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని సమాచారం.
ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా ఈసారి సరికొత్త టాస్కులను కంటెస్టెంట్లకు ఇవ్వడమే కాకుండా ఈసారి మాత్రం ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి మంచి క్రేజ్ ఉన్నటువంటి సెలెబ్రెటీలను ఈ కార్యక్రమంలోకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమానికి కొత్తగా పెళ్లయిన దంపతులతో పాటు విడాకులు తీసుకున్నటువంటి సెలబ్రిటీలను కూడా ఆహ్వానించబోతున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 7 లోపాల్గొనబోయే కంటెస్టెంట్ లో వీళ్లేనంటూ జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారు అనే విషయానికి వస్తే బుల్లితెర నటుడు అమర్ దీప్, తన భార్య తేజస్వినితో కలిసి రాబోతున్నారట.అలాగే మహేష్ బాబు కాళిదాసు, సిద్దార్థ్ వర్మ ఉన్నారు.ఇక యాంకర్స్ విషయానికి వస్తే దీపిక పిల్లితో( Deepika Pilli ) పాటు రష్మీ,( Rashmi ) విష్ణు ప్రియ( Vishnu Priya ) ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం.
మంగ్లీ, హేమచంద్ర, బుల్లెట్ బండి ఫేమ్ మోహన భోగరాజు, సాకేత్ కొమండూరి సింగర్స్ పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.
యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సిన్హా, సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, శోభా శెట్టి, మిత్రా శర్మ, ఈటీవీ ప్రభాకర్, కొరియోగ్రాఫర్ పండు, జబర్దస్త్ అప్పారావు, న్యూ రీడర్ ప్రత్యూష, మోడల్ సాయి రోనాక్, కామన్ మ్యాన్ క్యాటగిరిలో పల్లవి ప్రశాంత్ తోపాటు విడాకులు తీసుకున్నటువంటి నోయల్ ఎస్తేరు కూడా ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారనే వార్తలు వస్తున్నాయి .ఇక ఈ కార్యక్రమానికి ఈసారి నాగార్జున(Nagarjuna) కాకుండా రానా(Rana) హోస్ట్ గా వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.