ఈసారి జరగబోయే ఏపీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం( Kuppam Constituency ) హాట్ టాపిక్ గా మారబోతోంది.ఈ నియోజకవర్గం నుంచే చంద్రబాబు మళ్లీ పోటీ చేయబోతున్నారు.1989 నుంచి టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )ఈ నియోజకవర్గ నుంచి వరుసగా పోటీ చేస్తూ, గెలుస్తూ వస్తున్నారు.అప్పటి నుంచి ఆయనకు పరాజయం అనేది లేదు.
అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు ను ఓడించడమే లక్ష్యంగా వైసిపి అధినేత, జగన్ పావులు కలుపుతున్నారు.కుప్పంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు మెజారిటీ బాగా తగ్గింది.
ఇప్పుడు మెజారిటీ కాదు ఓడించడమే వైసిపి( YCP ) తమ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ మేరకు ఏపీ మంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడైన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ బాధ్యతలు అప్పగించారు.
ఇక్కడ టిడిపికి చెందిన కీలక నేతల ఎంతో మందిని వైసీపీలో చేర్చుకున్నారు.
![Telugu Ap, Chandrababu, Chandragiri, Ysrcp-Politics Telugu Ap, Chandrababu, Chandragiri, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/03/Babus-special-focus-on-Kuppam-Jagan-tooc.jpg)
కుప్పంలో అభివృద్ధి పైన వైసిపి ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.దీంతో ఇక్కడ గెలుపు అవకాశాలు అంతంతమాత్రంగానే చంద్రబాబుకు ఉంటాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కుప్పం నియోజకవర్గం పై గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.ఈనెల 25 , 26వ తేదీలలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముందుగా ఆయన కుప్పం నియోజకవర్గంలోనే పర్యటించాలని నిర్ణయించుకున్నారు.వాస్తవానికి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి స్వర్గంలోనే చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె( Naravaripalle ) ఉంది.
అయితే చంద్రబాబు మాత్రం 1989 నుంచి కుప్పం నే తన సొంత నియోజకవర్గంగా ఎంపిక చేసుకున్నారు .
![Telugu Ap, Chandrababu, Chandragiri, Ysrcp-Politics Telugu Ap, Chandrababu, Chandragiri, Ysrcp-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/03/Babus-special-focus-on-Kuppam-Jagan-toob.jpg)
ఈ నియోజకవర్గంలో ఇటు కర్ణాటక,తమిళనాడు సరిహద్దుల్లో ఉంది.ఎక్కువగా తమిళం, కన్నడ మాట్లాడే వారే ఈ నియోజకవర్గంలో ఎక్కువమంది ఉన్నారు.అటువంటి నియోజకవర్గం ను ఎంపిక చేసుకున్న చంద్రబాబు ఈసారి కుప్పంలో అత్యధిక మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
గతంలో చంద్రబాబు ఈ నియోజకవర్గంపై అంతగా ఫోకస్ పెట్టలేదు.నామినేషన్ దగ్గర నుంచి ప్రచార కార్యక్రమాల వరకు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులే అంతా చూసుకునేవారు.అయితే ఈసారి వైసిపి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం పై దృష్టి పెట్టడంతో చంద్రబాబు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, ప్రచారం నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు.ఇక్కడ చంద్రబాబుపై ఎమ్మెల్సీ భరత్ ను అభ్యర్థిగా జగన్ ప్రకటించారు.
దీంతో ఇక్కడ పోరు హారహోరిగా ఉండేలా కనిపిస్తోంది.