కౌశిక్ గాంధీ ల వివాదం : బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు అంత డ్యామేజ్ జరిగిందా ? 

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ , పాడి కౌశిక్ రెడ్డి( Arekapudi Gandhi , Kaushik Reddy ) మధ్య చెలరేగిన రాజకీయ వివాదం అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇమేజ్ ను బాగానే డ్యామేజ్ చేశాయి.ఈ అనవసర వివాదంతో రెండు పార్టీలు కోలుకోలేని  దెబ్బతిన్నాయనే అభిప్రాయం ఆయా పార్టీ నేతలు కనిపిస్తున్నాయి.

 Arekapudi Gandhi , Kaushik Reddy Controversy: Has The Brs Congress Been So Dama-TeluguStop.com

  స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు చెలరేగిన ఈ వివాదం తమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందనే టెన్షన్ రెండు పార్టీల్లోనూ కనిపిస్తున్నాయి.  పిఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ,  బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన వివాదంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది.

ఈ ఇద్దరికీ మద్దతుగా రెండు పార్టీలకు చెందిన నేతలు రోడ్లపైకి వస్తూ ఉండడం , జనాల్లోనూ దీనిపై చర్చ జరుగుతుండడంతో,  మేలు కన్నా నష్టమే ఎక్కువ జరిగిందనే అభిప్రాయం అటు కాంగ్రెస్,  ఇటు బీఆర్ఎస్ అగ్ర నేతల్లో కనిపిస్తున్నాయి .దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు అటు బీఆర్ఎస్ అగ్ర నేతలతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

Telugu Brs, Congress, Revanth Reddy, Telangana Cm, Telangana, Ts-Politics

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పిఏసి చైర్మన్ గా నియమించడంపై చెలరేగిన వివాదం బీఆర్ఎస్( BRS party ) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలతో మరింత రచ్చగా మారింది. అరికెపూడి గాంధీకి బిఆర్ఎస్ కండువా కప్పేందుకు ఆయన ఇంటికి వెళ్తానని చెప్పిన కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు .దీంతో అరికెపూడి గాంధీ , కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లడం మరింత వివాదం అయింది.ఈ సందర్భంగా అరికెపూడి గాంధీ తెలంగాణ వ్యక్తి కాదని,  ఆంధ్ర వ్యక్తి అని , కృష్ణాజిల్లా నుంచి ఆయన వలస వచ్చారని పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అరికెపూడి గాంధీ కంటే బీఆర్ఎస్ ఎక్కువ షాక్ కు గురైంది.

  తెలంగాణ ఉద్యమం ముగిసిన తర్వాత సెటిలర్స్ కు భద్రత కల్పించడంలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ( kcr )చొరవ చూపించడం తో మెజార్టీ సెటిలర్లు బీఆర్ఎస్ కు అనుకూలంగానే ఉన్నారు.

Telugu Brs, Congress, Revanth Reddy, Telangana Cm, Telangana, Ts-Politics

తెలంగాణ లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ రాజధాని పరిధిలో 17 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోగలిగింది.అయితే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో సెటిలర్స్ మద్దతు ఎక్కడ దూరమవుతుందోనని బీఆర్ఎస్ టెన్షన్ పడుతుంది.దీంతో ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టేందుకు బీఆర్ఎస్ అగ్రనేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం.

  ఇక కాంగ్రెస్ కూడా ఇదే అభిప్రాయంతో ఉంది . ప్రతిపక్షం విమర్శలు చేస్తే దానికి ప్రతి విమర్శలు చేస్తే సరిపోలేదని కానీ అంశాన్ని సీరియస్ గా తీసుకొని ముందుకు వెళ్లడంతోనే ఈ వివాదం మరింత ముదిరి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని , శాంతిభద్రతలు అదుపు తప్పయనే అభిప్రాయాలు జనాల్లోకి వెళ్లాయని,  కౌశిక్ రెడ్డి దూకుడుగా విమర్శలు చేస్తే ఆయనకు మాటలతోనే సమాధానం చెబితే సరిపోఏదని,  కానీ అరికెపూడి గాంధీ భారీ అనుచర గణం తో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆందోళన చేయడం కాంగ్రెస్ కు డ్యామేజ్ కలిగించిందని రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారట .అందుకే ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టేందుకు అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube