ఏపీ బీజేపీ( AP BJP )లో ఆసక్తి పరిణామాలు చోటుచేసుకున్నాయి .పార్టీలో సీనియర్ నేతలుగా గుర్తింపు పొందిన వారు యాక్టివ్ గా బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, పార్టీని బలోపేతం చేస్తూ వచ్చిన నాయకులంతా ఇప్పుడు పూర్తిగా సైడ్ అయిపోయినట్టుగానే కనిపిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపిలు పొత్తు పెట్టుకున్నాయి.అయితే ఈ పొత్తు విషయంలో సీనియర్ నేతలు కొంతమంది అసంతృప్తితోనే ఉంటూ వచ్చారు.
అయితే అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం కావడంతో, దానిని వ్యతిరేకించలేక, అలా అని టిడిపి తో కలిసి పని చేయలేక ఎన్నికల సమయంలోనూ తూతూ మంత్రంగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.దీంతో అప్పటి నుచి వీరి వ్యవహారాలపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తూనే ఉంది.
మొదటి నుంచి బిజెపిలో ఉంటూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న నేతలు ఈ విధంగా సైలెంట్ కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
![Telugu Ap Bjp, Ap, Gvl Simharao, Jagan, Somu Veeraju-Politics Telugu Ap Bjp, Ap, Gvl Simharao, Jagan, Somu Veeraju-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/05/jagan-tdp-vishnuvardan-reddy-cbn-ap-elections-ap-government-somu-veeraju-ap-politics.jpg)
ఇటీవల జరిగిన అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాలలోనూ అయిష్టంగానే పాల్గొన్నారు. పూర్తిస్థాయిలో వారు ఫోకస్ చేయలేదు.దీంతో వారి అలుకకు కారణం టిడిపి తో పొత్తు పెట్టుకోవడమే అన్న విషయం అర్ధం అవుతోంది.
ముఖ్యంగా పార్టీ సీనియర్ నేతలుగా గుర్తింపు పొందిన సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జివిఎల్ నరసింహారావు ( Somu Veerraju )వంటి వారి వ్యవహారం ప్రస్తుతం ఏపీ బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది.రాజమండ్రి ప్రాంతానికి చెందిన సోము వీర్రాజు అక్కడ నుంచి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని చూశారు.
అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి ( Daggubati Purandeswari )రాజమండ్రి ఎంపీ గా పోటీ చేయడంతో, సోమ వీర్రాజు సైలెంట్ అయ్యారు.
![Telugu Ap Bjp, Ap, Gvl Simharao, Jagan, Somu Veeraju-Politics Telugu Ap Bjp, Ap, Gvl Simharao, Jagan, Somu Veeraju-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/05/gvl-narasimharao-jagan-tdp-vishnuvardan-reddy-cbn-ap-elections-government-somu-veeraju.jpg)
ఎన్నికల సమయంలోనూ పెద్దగా ఆయన కనిపించలేదు.ఇక మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి ( VishnuVardhan Reddy)పరిస్థితి కూడా ఇంతే.ఆయన కదిరి నియోజకవర్గానికి చెందినవారు.
మొన్న జరిగిన ఎన్నికల్లో హిందూపురం స్థానం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయాలని భావించారు.కానీ టికెట్ దక్కకపోవడంతో సైలెంట్ అయిపోయారు.
ఇక విశాఖ ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో అక్కడే మకాం వేసి పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతూ, తన సొంత బలం పెంచుకుంటూ వచ్చిన జివిఎల్ నరసింహారావు కూడా సైలెంట్ అయ్యారు, ఆయనకు విశాఖ ఎంపీ సీటు దక్కకపోవడంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలోనూ ఆయన యాక్టివ్ గా కనిపించలేదు.దీంతో ఈ ముగ్గురి విషయంలో బిజెపి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది, వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారా లేక మరి ఏదైనా షాక్ ట్రీట్మెంట్ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.