మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీని వీడి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సమక్షంలో పార్టీలో చేరిన బాలశౌరి వైసీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.2004 నుంచి జగన్ జాతకం తనకు తెలుసు అంటూ బాలశౌరి సంచలన వ్యాఖ్యలు చేశారు.పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వం విఫలమైందని, దమ్ము ధైర్యంతో గొంతు ఎత్తే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ వ్యాఖ్యానించారు.
పవన్ తోనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని, రాష్ట్రంలో పవన్ ఉన్నారు కనుక రాష్ట్రంలో కొద్దో గొప్పో ప్రజాస్వామ్యం అమలవుతుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని విమర్శలు చేశారు.జనసేన( Janasena )లోకి వచ్చినందుకు తనకు ఆనందంగా ఉందని బాలశౌరి వ్యాఖ్యానించారు.వైస్సార్ హయాంలో ఎంపీగా చేసినప్పుడు తనకు చాలా సంతృప్తి కలిగించిందని మాట్లాడారు.2019లో రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి ఓట్లు అడిగింది గుర్తులేదా, 2024లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారో జగన్ చెప్పాలంటూ బాలశౌరి నిలదీశారు.
బాలశౌరి( Balashowry ) చేసిన ఈ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు.బాలశౌరి ఒక బఫూన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు .బాలశౌరి చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్ని బయట పెడతామని అంబటి అన్నారు.బాలశౌరి ఎవరికైనా నమ్మకద్రోహం చేయగలడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో వైసిపి 175 కు 175 స్థానాలు గెలుచుకోబోతుందని అంబటి వ్యాఖ్యానించారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబు పూర్తిగా రాజకీయాలకు దూరమవుతారని, పవన్ కళ్యాణ్ మునిగిపోయే నావతో చేతులు కలిపారు అంటూ ఎద్దేవా చేశారు.నమ్ముకున్న వాళ్లను పవన్ కళ్యాణ్ నట్టేట ముంచుతున్నాడని, జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని అంబటి పిలుపునిచ్చారు.
చంద్రబాబు( Chandrababu ) లాంటి మోసకారి ప్రపంచంలో ఎవరు ఉండబోరు అని, కావాలని కుట్రపూరితంగా హామీలు అమలుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.దేశంలో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారని, తమ పార్టీలో టికెట్ కోల్పోయిన బఫూన్స్ వేరే పార్టీలోకి వెళ్లి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ అంబటి మండిపడ్డారు.