ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ నేతలతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ( MLA Vasantha Krishnaprasad )ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను వైసీపీకి వ్యతిరేకం కాదన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తనకు పార్టీ మారే ఆలోచన లేదని ఎన్నోసార్లు చెప్పానన్నారు.కావాలనే కొందరుు మైలవరం నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహించారని పేర్కొన్నారు.
పార్టీలో ఉద్దేశపూర్వకంగానే గ్రూపులను ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు.మరోవైపు పథకాలు సరే… రోడ్లు, ఉద్యోగాలు ఏవని ప్రజలు అడుగుతున్నారని ఆయన చెప్పారు.రాజధాని విషయంలోనూ మోసం చేశారన్నారు.తాను వైసీపీకి ( ycp )వ్యతిరేకంగా పని చేయలేదన్న ఆయన పార్టీలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు తనను బాధించాయని తెలిపారు.
అదేవిధంగా కొండపల్లి మున్సిపాలిటీని వైసీపీ వాళ్లే ఓడించారని వెల్లడించారు.