టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు ( Chandrababu arrest )తర్వాత ఆయనను పరామర్శించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) టిడిపి తో జనసేన కలిసి ఎన్నికలకు వెళ్ళబోతుందని నిన్ననే ప్రకటించారు.వైసిపి వంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఓడించాలంటే, టిడిపి ,జనసేన కలిసి ముందుకు వెళ్లాల్సిందేనని పవన్ అభిప్రాయపడ్డారు.
ఇకపై ఉమ్మడిగా రెండు పార్టీలు కార్యాచరణను రూపొందించుకుని ముందుకు వెళ్తాయని , వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రకటించారు.అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన నేపథ్యంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
![Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Lokesh, Pavan Kalyan, Ysrcp-Politi Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Lokesh, Pavan Kalyan, Ysrcp-Politi](https://telugustop.com/wp-content/uploads/2023/09/Chandrababu-arrest-lokesh-YSRCP-ap-government.jpg)
జన సేన నాయకుల్లోనూ దీనిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.గతంలో టిడిపి ని విమర్శించి ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రజల్లో చులకన అవుతామనే అభిప్రాయాలు జనసేన నాయకుల్లో ఉండడంతో, ఇప్పుడు ఆ విషయంపై చర్చించేందుకు పొత్తులు, సీట్ల వ్యవహారం పైన పార్టీ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో వాటిపై క్లారిటీ ఇచ్చేందుకు జనసేన ( Janasena )విస్తృత స్థాయి భేటీని నిర్వహించాలని నిర్ణయించింది.దీనికోసమే శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృతస్థాయి భేటీ ని నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , జల్లా అధ్యక్షులు , కార్యదర్శులు , నియోజకవర్గాల ఇన్చార్జీలు , వీర మహిళలు, సమన్వయకర్తలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు , సంయుక్త కార్యదర్శులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే జనసేన పిలుపునిచ్చింది .
![Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Lokesh, Pavan Kalyan, Ysrcp-Politi Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Lokesh, Pavan Kalyan, Ysrcp-Politi](https://telugustop.com/wp-content/uploads/2023/09/Pavan-Kalyan-janasenanijanasena-BJP-TDP-Chandrababu-arrest-lokesh-YSRCP-ap-government-Nadendla-Manohar.jpg)
ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అధ్యక్షత వహిస్తారు.అలాగే ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) తో సహా ఇతర కీలక నేతలు హాజరు కాబోతున్నారు.ఈ సందర్భంగా పవన్ చేసిన పొత్తు ప్రకటన, అనంతరం ఏర్పడిన పరిస్థితులు వంటి అన్ని అంశాల పైన చర్చించి అనేక కీలక తీర్మానాలను ఆమోదించబోతున్నారు.టిడిపి తో ఏ విధంగా కలిసి వెళ్లాలి ? ఎన్నికల్లో ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి , సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేయాలి ? ఎన్ని సీట్లు తీసుకోవాలి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించబోతున్నారట.
.