టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ కెరీర్ పరంగా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.అలియా భట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ స్టార్ హీరోయిన్ ఇంట విషాదం నెలకొంది.అలియా భట్ తాతయ్య నరేంద్ర రజ్దాన్( Narendra Razdan ) 93 సంవత్సరాల వయస్సులో అనారోగ్య సమస్యలతో కన్ను మూశారు.
వృద్దాప్య సమస్యలతో గత కొంతకాలంగా నరేంద్ర బాధ పడుతూ మృతి చెందారు.
నరేంద్ర రజ్దాన్ మృతి చెందడంతో అలియా భట్( Alia Bhatt ) ఎమోషనల్ అయ్యారు.
అలియా భట్ తన పోస్ట్ లో తాతయ్యా నువ్వే నా హీరో అని చెప్పుకొచ్చారు.తాతయ్యా 93 సంవత్సరాల వయస్సులో కూడా నువ్వు గోల్ఫ్ ఆడావని ఆమె పేర్కొన్నారు.
నా కొరకు రుచికరమైన ఆమ్లెట్ ను నువ్వు వేసిచ్చేవాడివని అలియా భట్ చెప్పుకొచ్చారు.తాతయ్య తనకు బోలెడన్ని కథలు చెప్పేవాడని అమె కామెంట్లు చేశారు.
తాతయ్య వయోలిన్( violin ) వాయించేవాడని ఈ ముని మనవరాలితో ఆటలు కూడా ఆడుకున్నాడని ఆమె చెప్పుకొచ్చారు.తాతయ్య స్కెచ్ లన్నా, తాతయ్యక్రికెట్ ఆడే విధానం అన్నా చాలా ఇష్టమని అలియా భట్ తెలిపారు.నీ చివరి క్షణం వరకు నీ కుటుంబాన్ని లవ్ చేశావని అలియా పేర్కొన్నారు.ఇప్పుడు తాతయ్య లేడన్న బాధతో మనస్సు నిండిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.
అదే సమయంలో ఆనందంగా కూడా ఉందని అలియా భట్ పేర్కొన్నారు.తాతయ్య బోలెడంత సంతోషాన్ని ఇచ్చాడని అందుకు గర్వంగా ఉందని ఆమె అన్నారు.తాతయ్యను మళ్లీ కలుసుకునే వరకు దానిని అలాగే భద్రంగా దాచుకుంటానని అలియా పేర్కొన్నారు.అలియా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అలియా భట్ తాతయ్యకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.