నూతన ఆరంభం కోసం ఏడు రోజులలో వేగవంతంగా ఇంటికి నూతన అందం

రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి కాలంలోనే గడిచిపోవడమే కాదు నూతన హైబ్రిడ్‌ పని సంస్కృతి వేళ మన ఇంటిని మరింత ఆహ్లాదంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను తీసుకువచ్చింది.ఓ ఇల్లును అందమైన గృహంగా మార్చడానికి ఎంతో శ్రమిస్తుంటాం.

 A Day Quick Home Makeover For New Beginnings, Ceiling‌ Designing‌, Designer�-TeluguStop.com

ఫర్నిచర్‌ను సర్దడం మొదలు, గోడలకు రంగులు వేయడం నుంచి మనసుకు నచ్చిన ఫ్లోరింగ్‌ను ఎంచుకోవడం , ఇంటికి ఉన్న సీలింగ్‌ను అందంగా తీర్చిదిద్దడం వరకూ అన్ని అంశాలూ ఇంటికి పునరుజ్జీవింపజేయడానికి, వాటిని పండుగకు సిద్ధంగా మలచడానికి తోడ్పడతాయి.అయితే, మనలో చాలామంది హోమ్‌రెనోవేషన్‌ ప్రాజెక్ట్‌లను సాధ్యమైనంత వరకూ తప్పించుకోజూస్తారు.

ఎందుకంటే అవి అత్యధికంగా సమయం తీసుకోవడంతో పాటుగా అసౌకర్యమూ కలిగిస్తాయి.కానీ సరైన ప్రణాళిక, సృజనాత్మక ఇంటీరియర్‌ డిజైన్‌ ఆలోచనలతో సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే సమయం కోసం గృహాలను సమూలంగా మార్చవచ్చు.

మీ అవసరాలు, ప్రాధాన్యతలు, బడ్జెట్‌ను అందుకునే రీతిలో ఇంటీరియర్‌ డిజైన్‌ ఉండటం అత్యంత కీలకం.కానీ, ఈ ప్రక్రియలో మీ లివింగ్‌ స్పేస్‌లో అత్యంత కీలకమైన కొన్ని భాగాలను మాత్రం అసలు మరిచిపోకూడదు.

అలాంటి ఓ అత్యంత కీలకమైన అంశం సీలింగ్‌.మీరు ఒకవేళ మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే సూచనలివిగో.

సీలింగ్‌, అత్యవసరమైన 5వ గోడ : ఏదైనా ఇంటీరియర్‌ స్పేస్‌ను అలంకరించడం లేదా పునః అలంకరించడం చేయాలనుకుంటే సాఽధారణంగా గోడలు, ఫ్లోర్స్‌ మీద అధికంగా శ్రద్ధ చూపుతుంటారు.తమ అభిరుచులకు తగినట్లుగా అంశాలను మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ, సీలింగ్స్‌ సైతం ఇంటిలోని వాతావరణాన్ని ఆహ్లాదీకరించడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.

తమ ఇంటి ఐదవ గోడకు సౌందర్యం అందించేందుకు చాలా మంది డిజైనర్‌ కృత్రిమ సీలింగ్స్‌ను ఎంచుకుంటుంటారు.ఎలాంటి ఇంటీరియర్‌కు అయినా చూపుల పరంగా గణనీయమైన ప్రభావాన్ని అవి చూపుతాయి.

ప్రస్తుతం, బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు మరియు ఆఖరకు ఆర్కిటెక్ట్‌లు డిజైన్‌ ప్రక్రియ ఆరంభం నుంచి డిజైన్డ్‌ ఫాల్స్‌ సీలింగ్స్‌ వినియోగాన్ని నొక్కి చెబుతున్నారు.

సీలింగ్‌ మిత్రుడు : ఓ ఇంటి యజమానిగా, గణనీయంగా మీ ఇంటీరియర్స్‌కు పునః రూపకల్పన చేయడమన్నది అత్యంత ఖర్చుతో కూడిన అంశంగా కనిపించవచ్చు.అయితే, పని పూర్తిచేయడానికి, మీ ఇంటి సీలింగ్‌ పునరుద్ధరించడానికి మీ బ్యాంక్‌లో నిల్వ చేసిన నగదును మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం లేదు.కాకపోతే ఈ ప్రాజెక్ట్‌లో నమ్మకమైన భాగస్వామి అవసరం ఉంది.

సెయింట్‌ గోబైన్‌ జిప్రోక్‌ దీని కోసం మీ భావోద్వేగాలు, బడ్జెట్‌ మరియు గడువు తేదీలను అందుకునే రీతిలో సమగ్రమైన క్యాటలాగ్స్‌ను అభివృద్ధి చేసింది.కేవలం ఏడు రోజులలో మీ సీలింగ్‌కు నూతన అందాన్ని ఇవి అందించనున్నాయి.

జిప్సం సీలింగ్‌ ఖర్చు కేవలం ఒక అంశం మీద మాత్రమే కాదు నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది.అవి, డిజైన్‌ అవకాశాలు, ఇన్‌స్టాలేషన్‌ ఖర్చు, రవాణా మరియు కూలీ ఖర్చులు.

ఈ అంశాలన్నీ గుణించిన తరువాత, ఈ ఖర్చు సాధారణంగా చదరపు అడుగుకు 90–120 రూపాయల నడుమ ఉంటుందని భావించవచ్చు.అయితే, ఇదంతా కూడా మీరు సంప్రదించిన ఇంటీరియర్‌ డిజైనర్ల పై ఆధారపడి ఉంటుంది.

మీ లివింగ్‌ స్పేస్‌కు సంబంధించి అత్యుత్తమ డిజైన్‌ ఎంచుకునేందుకు తగిన మార్గనిర్దేశకత్వం కూడా జిప్రోక్‌ మీకు చేస్తుంది.ఇదంతా కూడా సహేతుకమైన, అందుబాటు ధరలలోనే అందిస్తుంది.

ఈ ఫలితంగానే, సీలింగ్స్‌ దగ్గరకు వచ్చేసరికి మీకు అత్యంత నమ్మకమైన మిత్రునిగా జిప్రోక్‌ నిలుస్తుంది.

సౌందర్యానికి అతీతంగా : జిప్సం బోర్డులను వినియోగించి సీలింగ్స్‌ డిజైనింగ్‌ దగ్గరకు వచ్చేసరికి, మీకు ఎంచుకునేందుకు ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.మీ సీలింగ్స్‌ కోసం విభిన్న ఆకృతులతో మీరు ప్రయోగాలు చేయడం మాత్రమే కాదు, మీ లివింగ్‌ స్పేస్‌కు నాటకీయతనూ జోడించవచ్చు.ఆకర్షణీయమైన ఫినీష్‌ను అందించడం ద్వారా మీ ప్రోపర్టీ యొక్క అందం ఇది మెరుగుపరుస్తుంది.

డిజైనర్‌ సీలింగ్స్‌తో సౌందర్యం మెరుగుపడటమే కాదు, పలు ప్రయోజనాలు సైతం ఇవి అందిస్తాయి.మీరు ఎయిర్‌ కండీషనర్‌ వినియోగించే అవసరాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా వేసవిలో విద్యుత్‌బిల్లులను సైతం తగ్గిస్తాయి.

ఉదాహరణకు మీ గది 12 X 12 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందనుకుందాం.మీ ఫాల్స్‌ సీలింగ్‌, వాస్తవ సీలింగ్‌కు ఒక అడుగు కిందకు ఉంటుంది.

దీనివల్ల 12 X 12 X 1 క్యూబిక్‌ స్పేస్‌ను తగ్గిస్తుంది.లేదంటే మీ ఏసీ ఆ ప్రాంతాన్ని కూడా చల్లబరచవలసి వస్తుంది.

విద్యుత్‌ పరంగా ఇది ఆదా అవుతుంది.ఇతర ప్రయోజనాలలో సమానంగా కాంతి పంపిణీ, గజిబిజిగా ఉన్న వైర్లు, పైపులు దాయబడటం, ఫాల్స్‌ సీలింగ్‌ సహాయంతో గదుల నేపథ్యం/మూడ్‌ను అవసరాలకు తగినట్లుగా మార్చుకోవడం వంటివి ఉన్నాయి.

ఈ వ్యాపారంలో సుప్రసిద్ధమైనది జిప్రోక్‌.ఇది వాల్‌ డెకార్‌, ఫాల్స్‌ సీలింగ్స్‌కోసం విస్తృతశ్రేణిలో అవకాశాలను అందిస్తుంది.

ఈ ఫాల్స్‌ సీలింగ్స్‌ అతి తేలికగా ఉండటంతో పాటుగా మన్నికైన మెటీరియల్స్‌ అయినటువంటి జిప్సం లాంటి వాటితో తీర్చిదిద్దడం జరుగుతుంది.ఇవి కనీసం రెండు దశాబ్దాల పాటు సాధారణ వినియోగానికి అనుకూలంగా ఉండటంతో పాటుగా సులభంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవడమూ వీలవుతుంది మరియు విభిన్నమైన డిజైన్లలో ఇవి లభిస్తాయి.

నూతన జీవనశైలికి మనం మార్గం వేస్తున్నాము.మనం ఆరోగ్యంగా, సురక్షితంగా మరియు సంతోషంగా ఉండేందుకు మనం ఉన్న వాతావరణం కూడా ఎప్పుడూ అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తూనే ఉంటుంది.

బయట జరిగే ఎన్నో అంశాలను మనం కొంతవరకూ మాత్రమే నియంత్రించగలం కానీ మన ఇల్లు మాత్రం మనకెప్పుడూ సురక్షిత స్వర్గంగానే ఉంటుంది.మహమ్మారి ప్రవేశించి దాదాపుగా మూడవ సంవత్సరం కావస్తోంది.

ఈ మార్పును స్వాగతించే ప్రాంగణాలుగా మాత్రమే కాదు నూతన ప్రారంభాలకూ గుర్తుగా గృహాలు నిలుస్తాయి.డెకార్‌లో సరైన మార్పులు చేయడం ద్వారా దీనికి సరైన సమాధానం చెప్పగలం.

అందువల్ల, నిలకడతో కూడిన రేపటి కోసం ఈ శీఘ్ర పరిష్కారాన్ని అమలు చేయండి, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్సవాలకూ జీవం పోయండి !!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube