ఐఏఎస్ అధికారి అంటే ఎంతో గొప్పవాడనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఉంది.ఐఏఎస్ అధికారి కావడమంటే మాటలు కాదంటారు.
ఎంతో తెలివితేటలుంటే తప్ప ఐఏఎస్ పరీక్ష ప్యాసు కాడంటారు.అంటే ఈ అధికారుల మీద అంత గౌరవం ఉందన్నమాట.
కాని ఎంత ఐఏఎస్ చదివినా కొందరికి బుద్ధి వంకరగా ఉంటుంది.క్రిమినల్ మైండ్ ఉంటుంది.
దేనికైనా వెనకాడని వారుంటారు.ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్న ఓ ఐఏఎస్ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇంతకూ ఇతను చేసిన పాడు పని ఏమిటి? అంటే తన స్నేహితుడినే చంపాలని ప్లాన్ చేశాడు.సంజీవ్ కుమార్ అనే ఈ అధికారిని, ఆయనతో ఉన్న ముగ్గురు దుండగులను అరెస్టు చేశారు.
వారి నుంచి కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.ఆస్తి తగాదకు సంబంధించి తన ప్రాణ మిత్రుడైన వ్యాపారవేత్తను హత్య చేయాలని ప్లాన్ చేశాడు.
అధికారి ఈ హత్య కోసం ఓ ప్రొఫెషనల్ కిల్లర్‌తో మాట్లాడుతుండగా పోలీసులు పట్టుకున్నారు.రెండేళ్ల క్రితం హర్యానాలో టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఈయనకు పదేళ్ల జైలు శిక్ష పడంది కూడా.
ఈ కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడు కూడా దోషులే.కంచే చేను మేయడమంటే ఇదే….!
.