నేడు రెండు బడా సినిమాలు ‘ఉత్తమ విలన్’, ‘గంగ’ రాబోతున్నాయంటూ తెలుగు సినీ ప్రేక్షకులు సంతోషంగా థియేటర్ల వద్దకు పొద్దు పొద్దునే చేరుకున్నారు.అయితే ఈ రెండు సినిమాలు కూడా విడుదల వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ‘ఉత్తమ విలన్’ విడుదల క్యాన్సిల్ విషయంపై క్లారిటీ రాగా, గంగ విడుదలపై ఇంకా కాస్త అనుమానాలు ఉన్నాయి.ప్రస్తుతానికి నిర్మాతకు మరియు ఫైనాన్సియర్లకు మధ్య చర్చలు జరుగుతున్నాయని, మద్యాహ్నం వరకు అయినా విడుదలకు మార్గం సుగమం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఇప్పటికే తమిళంలో విడుదలైన ‘గంగ’ సినిమాకు తెలుగులో కూడా భారీ క్రేజ్ ఉంది.దాంతో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
‘ముని’, ‘కాంచన’ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు.అయితే చివరి నిమిషంలో వాయిదా పడటంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
రెండు సినిమాలు కూడా చివరి నిమిషంలో రాకపోవడంతో సినీ వర్గాల్లో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.ఈ రెండు సినిమాల కారణంగా ఇతర సినిమాలు విడుదల వాయిదా వేయడం జరిగింది.
ఒక్క రోజు ముందు తెలిసినా కూడా ఆ సినిమాల విడుదల చేసే అవకాశాలు ఉండేవి.కాని ఇప్పుడు వాయిదా వల్ల ఈ వారం శూన్య వారంగా మిగిలి పోయినట్లే అని సినీ వర్గాల వారు అంటున్నారు.