విలన్‌కు అడ్డంకులు

అనేక అవాంతరాల మధ్య నేడు విడుదల అవుతుందని భావించిన ‘ఉత్తమ విలన్‌’ మూవీ చివరి నిమిషంలో ఆగి పోయింది.నేడు ఉదయం థియేటర్లలో సందడి చేయాల్సిన ఉత్తమ విలన్‌ రాలేదు.

 Uttama Villain Movie Release Delayed-TeluguStop.com

సినిమా చూసేందుకు వెళ్లిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది.ఇప్పటికే పలు సార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా ఈ సారి మాత్రం చివరి నిమిషంలో వాయిదా పడటంతో సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

బడా హీరోల సినిమాలకు మాములుగా అయితే ఇలాంటి సమస్యలు రావు.కాని ఈ సినిమాకు పదే పదే ఆర్థిక ఇబ్బందులు రావడంతో సినిమాపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 1500 థియేటర్లలో నేడు విడుదల చేయాలని భావించినప్పటికి, ఆర్థిక ఇబ్బందులే సినిమా విడుదలకు అడ్డు పడ్డట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాకు మరో వైపు వీహెచ్‌పీ కార్యకర్తల నుండి ఎదురు దెబ్బ తగులుతోంది.

ఈ సినిమాలో హిందూ సమాజాన్ని అవమాన పర్చేలా సన్నివేశాలు ఉన్నాయని వారు అంటున్నారు.కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా కుమార్‌ మరియు ఆండ్రియాలు హీరోయిన్‌లుగా నటించారు.

రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ మరియు లింగు స్వామిలు నిర్మించారు.వాయిదా పడ్డ ఈ సినిమా ఎప్పుడు వచ్చేనో త్వరలో తేలనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube