టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దిల్ రాజు( Dil Raju ) ఒకరు.డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన ఈయన ప్రయాణం నిర్మాతగా మారి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేసే స్థాయిలో దిల్ రాజు ఉన్నారని చెప్పాలి.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈయన ఒక స్టార్ హీరో గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రకాష్ రాజ్( Prakash Raj ) నటించిన ఆకాశమంత( Akashamantha ) సినిమా తమిళంలో చూసి దానిని నేను కూడా తెలుగులో విడుదల చేయాలని అనుకున్నాను.తమిళ్ లో రిలీజ్ కంటే ముందే నేను తీసేసుకున్నాను తెలుగులో రిలీజ్ చేద్దామని.
నాకు బాగా నచ్చింది.
![Telugu Akashamantha, Dil Raju, Dilraju, Jagapathi Babu, Prakash Raj, Tollywood-M Telugu Akashamantha, Dil Raju, Dilraju, Jagapathi Babu, Prakash Raj, Tollywood-M](https://telugustop.com/wp-content/uploads/2024/11/Dil-raju-interesting-comment-on-jagapathi-babu-detailss.jpg)
ఇక తమిళ్ లో రిలీజ్ అయిన తర్వాత జగపతి బాబును( Jagapathi Babu ) కలిసి ఇలా ఓ సినిమా చేయాలనుకుంటున్నాను మీరు కూడా ఓసారి చూడండి అని చెప్పాను.ఇక జగపతిబాబు గారు సినిమా చూసిన తర్వాత నన్ను పిలిపించి సినిమా బాగుంది చేద్దామని చెప్పారు.ఆయన సినిమా చేయడానికి ఒప్పుకోవడంతో చాలా సంతోషపడి రెమ్యూనరేషన్ గురించి మాట్లాడాను.
![Telugu Akashamantha, Dil Raju, Dilraju, Jagapathi Babu, Prakash Raj, Tollywood-M Telugu Akashamantha, Dil Raju, Dilraju, Jagapathi Babu, Prakash Raj, Tollywood-M](https://telugustop.com/wp-content/uploads/2024/11/Dil-raju-interesting-comment-on-jagapathi-babu-detailsd.jpg)
ఈ సినిమా కోసం మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వమంటారు చెప్పండి సార్ అని అడగగా వెంటనే జగపతిబాబు రెమ్యూనరేషన్ నాకు ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పారు.ఆ మాట వినగానే ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.జగపతిబాబు లాంటి స్టార్ హీరో నా సినిమాలో నటించడం చాలా ఎక్కువ అలాంటిదే ఆయన రూపాయి కూడా రెమ్యూనరేషన్ లేకుండా నటించడం అంటే మామూలు విషయం కాదు ఒక మంచి సినిమాలో నేను కూడా భాగం అవ్వాలని రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని చెప్పారు.అప్పటి నుంచి నాకు ఆయన దగ్గర ఋణం లాగ మిగిలిపోయింది.
మనం డబ్బులు, పేర్లు కాదు మనుషులను సంపాదించుకోవాలని అన్నారు దిల్ రాజు. జగపతిబాబు గురించి దిల్ రాజు ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.