హైదరాబాద్( Hyderabad ) నగర వాసులకు విజ్ఞప్తి.ఇకనుండి మీకు ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) ఝలక్ ఇవ్వనున్నారు.
ముఖ్యంగా హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడపడం, రాంగ్ రూట్లో పయనించేవారికి ట్రాఫిక్ పోలీసు అధికారులు సరియైన బుద్ధి విధించనున్నారు.గతంలో హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.100 ఫైన్ వేసేవారు.ఇప్పడు ఆ జరిమానాను 100 శాతం పెంచి, రూ.200 ఫైన్ విధించాలని నిర్ణయించారు.అదనంగా రూ.35 ఛార్జీలు కూడా అందులో ఉండనున్నాయి.ఇక రాంగ్ రూట్లో వెళ్లినవారి సంగతి సరేసరి! రాంగ్ రూట్లో( Wrong Route ) వెళ్తే భారీగ జరిమానా విధించనున్నారు.దాదాపు రూ.2000 వరకు ఫైన్ విధించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.దీనికి తోడు రూ.35 ఛార్జీలు మామ్మూలే.
ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ అధికారి విశ్వప్రసాద్ తాజాగా ఆదేశాలను జారీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే మోటర్ వెహికల్ చట్టం( Motor Vehicle Act ) ప్రకారం గరిష్ఠంగా జరిమానా విధించాల్సి వస్తుంది అని అన్నారు.హెల్మెట్( Helmet ) లేకుండా టూ వీలర్ నడిపేవారు, రాంగ్ రూట్లో వెళ్లే వారికి ప్రత్యేక డ్రైవ్( Special Drive ) నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.అదేవిధంగా వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లను కూడా వసూలు చేయాలని సూచించారు.
ప్రస్తుతం 3 కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.అయినప్పటీకి కొంత మంది వాహనదారుల్లో మార్పు రావడం లేదని చెప్పుకొచ్చారు.
అందుకే జరిమానా పెంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాబట్టి సో ఇక నుంచి ఇక నుంచి మీరు హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.235 జేబులో ఉండాల్సిందే.ఇక రాంగ్ సైడ్ డ్రైవ్ చేసినవారు అయితే ఏకంగా రూ.2035 కట్టాల్సిందే.గతంలో రాంగ్ రూట్లో వెళ్తే రూ.1000 జరిమానా విధించే వారు.కొన్ని సందర్భాల్లో కోర్టుకు కూడా హాజరు పరిచేవారు.
కాగా రాంగ్ రూట్ డ్రైవింగ్ పై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.రాంగ్ రూట్ వెళ్లి చాలా మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసులు స్వయంగా చెబుతున్నారు.
అయినప్పటికీ చాలా మంది రాంగ్ రూట్ లో వెళ్తున్నారు.కొద్ది రోజులు క్రితం కూకట్ పల్లి ఓ వ్యక్తి స్కూటర్ పై రాంగ్ రూట్ లో వచ్చి యూ టర్న్ ఎస్ టర్న్ తీసుకోవాలని చూసి రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.