పవన్ కళ్యాణ్ దేశానికి వెన్నెముక.. వైరల్ అవుతున్న మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గ్రామాలు, మండలాలు, పట్టణాలు, నగరాలు అనే తేడాల్లేకుండా పవన్ కళ్యాణ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

 Madhavilatha Interesting Comments About Pawan Kalyan Details, Pawan Kalyan, Depu-TeluguStop.com

అయితే ఇండస్ట్రీలో సైతం పవన్ కళ్యాణ్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ దేశానికి వెన్నెముక అంటూ ఒక హీరోయిన్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Telugu Actressmadhavi, Deputycm, Janasena, Madhavi Latha, Pawan Kalyan, Yogi Adi

సొంత పార్టీని సైతం విమర్శించడం పవన్ కళ్యాణ్ లో మెచ్చుకోదగిన అంశం అని మాధవీలత( Madhavi Latha ) పేర్కొన్నారు.సొంత పార్టీ నేతల గురించి క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడటం పవన్ కళ్యాణ్ లో తనకు నచ్చిన అంశం అని ఆమె పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో గట్టిగా రియాక్ట్ కావడం తనకు ఎంతగానో నచ్చిందని మాధవీలత వెల్లడించారు.

Telugu Actressmadhavi, Deputycm, Janasena, Madhavi Latha, Pawan Kalyan, Yogi Adi

అవసరం అనుకుంటే హోం శాఖ తీసుకుంటానని యోగి ఆదిత్యనాథ్ లా( Yogi Adityanath ) చేస్తనని పవన్ కళ్యాణ్ చెప్పారే తప్ప పవన్ సొంత పార్టీ నేతలను తిట్టలేదని ఆమె వెల్లడించారు.నేరస్తుడిని నేరస్తుడిలానే చూడాలని పవన్ చేసిన కామెంట్స్ ఆహ్వానించదగ్గవని ఆమె తెలిపారు.పవన్ దేశానికి వెన్నెముక అంటూ ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలలో నటిస్తున్నా ఈ సినిమాల షూటింగ్స్ ఎప్పటికి పూర్తవుతాయో చూడాల్సి ఉంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ కు భారీ విజయాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తర్వాత ప్రాజెక్ట్స్ ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube