దివంగత హీరో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) గారి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.
ఇకపోతే ఆయన కెరియర్ లో ఎన్నో సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.వాటిలో ప్రేమాభిషేకం సినిమా( Premabhishekam ) కూడా ఒకటి.ఇది 1980వ దశకంలో చరిత్ర సృష్టించింది.1981 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేసింది.దాదాపు 60 సంవత్సరాల వయసులో లవర్ బోయ్ గా నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు ఏఎన్ఆర్.
తెలుగు సినిమా చరిత్రలో అప్పటివరకు రూ.4 కోట్లు షేర్ కలెక్ట్ చేసిన సినిమా లేదు.ప్రేమాభిషేకం మొత్తం రూ.4.5 కోట్లు షేర్ కలెక్ట్ చేసి అప్పట్లో రికార్డు సృష్టించింది.శతదినోత్సవంలో, ప్లాటినం జూబ్లీలో రికార్డు ఈ సినిమా సొంతం.20 కేంద్రాల్లో 200 రోజులు, 11 కేంద్రాల్లో 300 రోజులు, 8 కేంద్రాల్లో సంవత్సరం పాటు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం ప్రేమాభిషేకం. 29 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడిన చిత్రంగా ఆరోజుల్లో రికార్డ్ క్రియేట్ చేసింది.దాదాపు 18 సంవత్సరాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన సమరసింహారెడ్డి( Samarasimha Reddy ) ఆ రికార్డును క్రాస్ చేసింది.అయితే లెక్కకు మించిన రికార్డులను సొంతం చేసుకొని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ప్రేమాభిషేకం సినిమాను మధ్యలోనే ఆపెయ్యాలనుకున్నారన్న విషయం చాలామందికి తెలీదు.
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావుకు( Dasari Narayana Rao ) అక్కినేని నటించిన దేవదాసు, బాటసారి ఫేవరేట్ సినిమాలు.దేవదాసు( Devadasu ) తరహా కథాంశాలతో సినిమాలు చెయ్యాలని ఆయన ఎప్పుడూ భావించేవారు.అందుకే దేవదాసు మళ్లీ పుట్టాడు చిత్రాన్ని రూపొందించారు.ప్రేమాభిషేకం సినిమాను ఎనౌన్స్ చేసినపుడు కూడా దేవదాసు చిత్రాన్ని మళ్ళీ తీస్తున్నారని అంతా భావించారు.ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయిన తర్వాత ఏలూరులో ఉండే అక్కినేని నాగేశ్వరరావు బంధువు ఒకరు హైదరాబాద్ వచ్చి, అక్కినేనికి ఆయనంటే ఎంతో గౌరవం.ఏ విషయాన్ని అయినా ఆయనతో డిస్కస్ చేసేవారు.
అలా మాటల సందర్భంలో ప్రేమాభిషేకం ప్రస్తావన వచ్చింది.దాసరి దేవదాసు చిత్రాన్నే మళ్లీ తీస్తున్నాడని అనుకున్నారు.
వాళ్ళే కాదు, యూనిట్ లోని 60 మంది సభ్యులు కూడా అదే భావనలో ఉన్నారు.ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది.
ఇప్పటి వరకు తీసిన ఫుటేజ్ ని తగలబెట్టెయ్యమని అక్కినేని బంధువు, దాసరి నారాయణరావుకు ఎంతో సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తికి చెప్పారు.దానికి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి తీసిన దాన్ని తగలబెట్టుకుంటే ఏం వస్తుంది? తీసింది ఏదైనా జనంలోకి పంపిస్తేనే దాని ఫలితం ఏమిటనేది తెలుస్తుంది.కాబట్టి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అక్కినేనికి కూడా చెప్పమని ఆ వ్యక్తి సలహా ఇచ్చాడు.అక్కినేని, ఆయన బంధువు అలాంటి ఆలోచనతో ఉన్నారన్న విషయం ఎలాగో దాసరి నారాయణరావు చెవికి చేరింది.
అయినా దాన్ని పట్టించుకోకుండా సినిమాను అద్భుతంగా తియ్యాలన్న పట్టుదలతోనే ఆయన ఉన్నారు.కథ, కథనం, మాటలు ఇలా ఏ విషయంలోనూ రాజీ పడకుండా తను అనుకున్న ఔట్‌పుట్ వచ్చేవరకు అవిశ్రాంతంగా కృషి చేశారు దాసరి.
ఫలితంగా ఒక దృశ్యకావ్యం ఆవిష్కరించబడింది.