తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు.కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో ఆయన భేటీ కానున్నారు నిన్ననే ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన రేవంత్ ఈరోజు ఉదయం జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjun Kharge )ను పరామర్శించనున్నారు.
ఇటీవల ఆయన ఒక బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా అస్వస్థతకు గురి కావడంతో రేవంత్ ఆయనను పరామర్శించనున్నారు.ఆ తరువాత కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రేవంత్ సమావేశం కానున్నారు.
అయితే ఈ సమావేశంలో ఏ ఏ అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి వేటిపై రేవంత్ చర్చించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాల పైన రేవంత్ చర్చించనున్నారు.
![Telugu Hydra, Rahul Gandhi, Revanth Reddy, Revanthreddy, Telangana Cm, Ts-Politi Telugu Hydra, Rahul Gandhi, Revanth Reddy, Revanthreddy, Telangana Cm, Ts-Politi](https://telugustop.com/wp-content/uploads/2024/10/Revanth-Reddy-Telangana-CM-revanth-Reddy-Delhi-tour-rahul-gandhi-politics-Mallikarjuna-karge.jpg)
ఇక మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం పెద్దలతో మంత్రివర్గ కూర్పు పై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దొరుకుతుందనేది ఉత్కంఠ కలిగిస్తుంది.అయితే హర్యానా, కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు బిజీగా ఉండడంతో రేవంత్ వారిని కలిసే అవకాశం లేదని , ఆయన కేవలం మల్లికార్జున ఖర్గే ను పరామర్శించి వచ్చేస్తారని కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే ఈ దసరా లోపు మంత్రివర్గ విస్తరణను చేపట్టాలని రేవంత్ పట్టుదలతో ఉన్నారట.
దీంతో పాటు, హైడ్రా( Hydra ) మూసి ప్రక్షాళన వంటి అంశాల పైన ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.
![Telugu Hydra, Rahul Gandhi, Revanth Reddy, Revanthreddy, Telangana Cm, Ts-Politi Telugu Hydra, Rahul Gandhi, Revanth Reddy, Revanthreddy, Telangana Cm, Ts-Politi](https://telugustop.com/wp-content/uploads/2024/10/Telangana-CM-revanth-Reddy-Delhi-tour-rahul-gandhi-ts-politics-Mallikarjuna-karge-Hydra.jpg)
హైడ్రా కూల్చివేతలు , మూసి సుందరీకరణ ప్రాజెక్టు పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అధిష్టానం పెద్దలు రేవంత్ పై సీరియస్ గా ఉన్నారని, వారికి వివరణ ఇచ్చేందుకే రేవంత్ ఢిల్లీకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది.మంత్రివర్గ విస్తరణ చేపడితే అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.